OTT Movie : ‘ఫైనల్ డెస్టినేషన్’ ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. తెర మీద జనాలు చనిపోయే సీన్స్ అంత భయంకరంగా ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ సీరీస్ లు ప్రేక్షకులను ఓ మరచిపోలేని థ్రిల్ ని ఇచ్చాయి. 2000 సంవత్సరం లో వచ్చిన పార్ట్ 1 సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమా ఆడియన్స్ ను బాగానే భయపెట్టింది. ఫైనల్ డెస్టినేషన్ 2000 సంవత్సరం నుంచి ఆరు పార్ట్ లు తీశారు. ఐతే లేటెస్ట్ సీరీస్ కు మాత్రం దాదాపు 14 ఏళ్ల దాకా టైం తీసుకున్నారు. లేటెస్ట్ గా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ థియేటర్లలో అదరగొట్టి, ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
1986 లో సీటెల్‌లోని స్కైవ్యూ రెస్టారెంట్ టవర్ ఓపెనింగ్ సెరెమనీలో, ఐరిస్ కాంప్‌బెల్ కు ఒక ప్రీమోనిషన్ వస్తుంది. ఒక కాయిన్ ట్రిగ్గర్ చేసిన చైన్ రియాక్షన్ వల్ల చాన్డిలియర్ షార్డ్ గ్లాస్ డాన్స్ ఫ్లోర్‌ను బ్రేక్ చేస్తుంది. గ్యాస్ లీక్ ఇగ్నైట్ అవుతూ టవర్ కూలిపోయి అందరూ చనిపోతారు. ఐరిస్, ఒక చిన్న అబ్బాయి లాస్ట్‌గా మిగులుతారు. ఐరిస్ కాయిన్ తీసివేసి, పీపుల్‌ను ఫ్లోర్ నుండి దూరం చేసి డిజాస్టర్‌ను అడ్డుకుంటుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా తన వాళ్లను కాపాడుకోలేక పోతుంది. ఐరిస్ తన జీవితంలో ఈ కర్స్‌ను రిసెర్చ్ చేస్తూ ఒక బుక్ రాస్తుంది.
స్టోరీ ఇప్పుడు ప్రెజెంట్ కు వస్తుంది. ఐరిస్ గ్రాండ్‌డాటర్ అయిన స్టెఫానీ రీస్ స్కైవ్యూ కూలిపోవడం గురించి బాధపడుతోంది. ఆమె గ్రాండ్‌మదర్ ఐరిస్ ఇప్పుడు క్యాన్సర్‌తో పోరాడుతుంటుంది. ఐరిస్, స్టెఫానీకి కర్స్ గురించి చెప్తుంది. డెత్ తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తోందని, ఆమె విజన్స్ 1968 డిజాస్టర్‌కు లింక్ అని రివీల్ చేస్తుంది. ఇక స్టెఫానీ తన కజిన్స్ చార్లీ, బాబీ, ఎరిక్ తో కలిసి ఈ కర్స్‌ను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది.
కర్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒక్కొక్కరినీ ఎలాబొరేట్, గ్రిజ్లీ వేలో చంపడం స్టార్ట్ చేస్తుంది. స్టెఫానీ ఐరిస్ బుక్‌ను రీడ్ చేసి, డెత్‌ను చీట్ చేయడానికి పాస్ట్ సర్వైవర్స్ మెథడ్స్‌ను లెర్న్ చేస్తుంది. అందులో కిమ్బర్లీ మెథడ్ వర్క్ చేసిందని కన్ఫర్మ్ అవుతుంది. స్టెఫానీ విలియం బ్లడ్‌వర్త్ ను కలుస్తుంది. అతను 1968లో స్కైవ్యూలో సర్వైవర్‌గా, డెత్ టార్గెట్‌గా ఉన్న చిన్న అబ్బాయి అని రివీల్ అవుతాడు. బ్లడ్‌వర్త్ డెత్ రూల్స్ గురించి స్టెఫానీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఐరిస్ బ్లడ్‌లైన్‌ను క్లియర్ చేసిన తర్వాత అతను లాస్ట్ టార్గెట్ అవుతాడు.
స్టెఫానీ , చార్లీ, ఎరిక్ ఒక ఫైనల్ స్టాండ్ తీసుకుంటారు, డెత్‌ను ట్రిక్ చేయడానికి ఒక రిస్కీ ప్లాన్ అమలు చేస్తారు. స్టెఫానీ ఒక లైఫ్ సేవ్ చేయడం ద్వారా కర్స్ బ్రేక్ చేయాలనుకుంటుంది. చివరికి స్టెఫానీ విజన్స్ ఆమెను సేవ్ చేస్తాయా ? ట్రాప్‌లోకి లీడ్ చేస్తాయా? క్లైమాక్స్‌లో స్టెఫానీ కర్స్ బ్రేక్ చేస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మనుషుల్ని మట్టున మాయం చేసే ఫ్యామిలీ… స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Final Destination: Bloodlines’. ఇది Final Destination ఫ్రాంచైజీలో వచ్చిన ఆరవ చిత్రం. 2025 లో మే 16న విడుదలైన ఈ సినిమాకి ఈ . జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టీన్ దర్శకత్వం వహించారు. ఇది సిరీస్‌లో బెస్ట్-రివ్యూడ్, హైయెస్ట్-గ్రాసింగ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా నిలిచింది. వరల్డ్‌వైడ్ $272 మిలియన్ లు వసూలు చేసింది. ఇందులో కైట్లిన్ సాంటా జువానా, టియో బ్రియోన్స్, బ్రెక్ బాసింగర్, టోనీ టాడ్ నటించారు. 90 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.0/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం HBO Max లో ఈ సినిమా అందుబాటులో ఉంది.