BigTV English

OTT Movie : రెండేళ్ల తర్వాత రెండు ఓటీటీల్లోకి హాలీవుడ్ హై ఆక్టేన్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్… ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

OTT Movie : రెండేళ్ల తర్వాత రెండు ఓటీటీల్లోకి హాలీవుడ్ హై ఆక్టేన్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్… ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

OTT Movie : క్రిస్మస్ ఈవ్ రోజున, బ్రియాన్ గాడ్‌లాక్ తన కొడుకు టేలర్‌ను ఒక గ్యాంగ్ వార్ లో కోల్పోతాడు. అంతే కాకుండా అతని గొంతు కూడా పోతుంది. రివేంజ్ కోసం బ్రియాన్ ఒక డెడ్లీ విజిలాంటెగా మారతాడు. గ్యాంగ్ లీడర్ ప్లాయాను టార్గెట్ చేస్తాడు. ఈ డైలాగ్ లెస్ యాక్షన్ థ్రిల్లర్‌లో, బ్రియాన్ తన మిషన్‌ను పూర్తి చేయగలడా? ఈ రివెంజ్ అతన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేస్తుందా? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

బ్రియాన్ గాడ్‌లాక్ ఒక ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ, తన భార్య సాయా, కొడుకు టేలర్‌తో సాధారణ జీవితం గడుపుతుంటాడు. క్రిసమస్ ఈవ్ రోజు రైవల్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన డ్రైవ్-బై షూటింగ్‌లో టేలర్ బులెట్‌కు గురై చనిపోతాడు. బ్రియాన్ గొంతుకు గాయం కావడంతో మాట్లాడలేని స్థితికి చేరుతాడు. ఈ ట్రాజెడీ నుండి సాయా కోలుకోవడం కష్టంగా ఉంటుంది. బ్రియాన్ దేనికి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఒక సంవత్సరం తర్వాత, క్రిసమస్ ఈవ్ నాటికి బ్రియాన్ తనను తాను విజిలాంటెగా ట్రాన్స్‌ఫామ్ చేసుకుంటాడు. అతను గన్స్, కంబాట్ స్కిల్స్, డ్రైవింగ్ ట్రెనింగ్ తీసుకుంటాడు. John Wick-స్టైల్ యాక్షన్ హీరోగా మారతాడు. అతని టార్గెట్ టేలర్ మరణానికి కారణమైన గ్యాంగ్ లీడర్ ప్లాయాను అంతం చేయడమే.


ఇక బ్రియాన్ గాడ్‌లాక్ గ్యాంగ్ ఆపరేషన్స్‌ను డిస్రప్ట్ చేస్తూ, ఒక గోడపై నుంచి గ్యాంగ్ మెంబర్స్ ఫోటోలతో ట్రాక్ చేస్తాడు. డిటెక్టివ్ డెన్నిస్ వాస్సెల్, గ్యాంగ్ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తూ, బ్రియాన్ రివెంజ్ మిషన్‌ను అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. ప్లాయా గ్యాంగ్‌తో అతనికి కూడా కొంత కనెక్షన్ ఉంటుంది. బ్రియాన్ రేడియో స్కానర్‌తో పోలీస్ కమ్యూనికేషన్స్‌ను మానిటర్ చేస్తూ, గ్యాంగ్ హైడ్‌అవుట్స్‌ను టార్గెట్ చేస్తాడు. సాయా, బ్రియాన్‌ను ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ అతను ఆమెను దూరం పెట్టి, తన మిషన్‌పై ఫోకస్ చేస్తాడు. ఇక చివరిగా ఈ గ్యాంగ్ ని అంతం చేసే ప్లాన్ తో వస్తాడు. ఇంతకీ  బ్రియాన్ ప్లాయాను అంతం చేస్తాడా ? వాస్సెల్, బ్రియాన్‌ను అరెస్ట్ చేస్తాడా ? సాయా, బ్రియాన్‌ రిలేషన్ ఏమవుతుంది ? అనే ఈ విషయాలను, ఈ రివేంజ్ యాక్షన్-థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : భర్తను వదిలేసి వేరే అమ్మాయితో… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే బుర్ర కరాబ్

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ రివేంజ్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ పేరు ‘Silent Night’. 2023 లో వచ్చిన ఈ సినిమాకి జాన్ వూ దర్శకత్వం వహించారు. ఇది డైలాగ్ లేని విజువల్ స్టోరీ టెల్లింగ్‌తో యాక్షన్-థ్రిల్లర్ డ్రామాను చూపిస్తుంది. రాబర్ట్ ఆర్చర్ లిన్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా, జోయెల్ కిన్నమన్, కాటాలినా సాండినో మొరెనో, కిడ్ కడి, హెరాల్డ్ టోరెస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక తండ్రి రివేంజ్ చుట్టూ తిరుగుతుంది. 104 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.3/10 రేటింగ్ ఉంది. పీకాక్ (Peacock), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 20న లయన్స్ గేట్ ప్లేలో ఇండియాలో అడుగు పెట్టబోతోంది.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×