Allu Arjun:అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. బెనిఫిట్ షోలకి, టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకున్న చిత్ర బృందం, అందులో భాగంగానే డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి బెనిఫిట్ షో వేశారు. అయితే హైదరాబాద్ లోని క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేయగా.. అక్కడికి అల్లు అర్జున్ ఎటువంటి పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనికి తోడు అక్కడి ఉన్న ఆడియన్స్ ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. మరొకవైపు ఒక మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
బన్నీ చేసిన తప్పులపై ఏసీపీ రియాక్షన్..
అయితే బాధ్యతాయుతంగా ప్రవర్తించని అల్లు అర్జున్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని మళ్లీ ఆయన ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్ పెట్టడంపై ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ పేరు తీయకుండానే ఆయన కామెంట్ చేశారు.. “అక్కడ జరిగిన సంఘటన నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా నిమిషం నిమిషానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం వంటివి చేస్తూ సమాజాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. అసలు రిమాండ్ ఖైదీగా ఉన్న వాడు ప్రెస్ మీట్ పెట్టవచ్చా.? ఆయనకి ఆ అధికారం ఉందా..? ఖైదీగా ఉన్న వ్యక్తి తన అభిప్రాయాలను ప్రజలలో చెప్పవచ్చా? క్యాష్ పిటిషన్ మీద బెయిల్ వచ్చింది. కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉందో లేదో మాకు తెలియదు. ఆయనే చెప్పాలి. ఇక నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా మిత్రుడు ఒక ప్రశ్న అడిగితే అవన్నీ చెప్పకూడదని చెప్పి, ఆ తర్వాత నేను, సుకుమార్ కొంత డబ్బు వేసుకొని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దానిని ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. అయితే ఇది బయటకు చెబితే ఏమవుతుందంటే.. ముద్దాయిగా ఉన్న వ్యక్తి బాధితులకి డబ్బు ఎరగా వేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. నిజానికి ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయించే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా ప్రెస్ మీట్ లు పెట్టడం, సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం , అలాగే డబ్బు ఉంది కదా అని ఒక 50 మంది బౌన్సర్లను పెట్టి వారితో ప్రజలపై దాడి చేయించడం ఇవన్నీ కూడా చెడ్డ విరుద్ధం.
సెన్సార్ బోర్డుపై కూడా అసహనం..
ఇదే కాదు అసలు ఆయన సినిమాలలో కూడా పోలీస్ ఆఫీసర్ బట్టల ఊడగొట్టి పోలీస్ స్టేషన్లో వదిలేస్తే.. అక్కడ ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టలేదు. అసలు ఇలాంటి విషయాలను సెన్సార్ ఎలా అంగీకరిస్తుందో అర్థం కావడం లేదు. అసలు అధికారులను ఏమనుకుంటున్నారు? ఎలా మీరు చిత్రీకరించాలనుకుంటున్నారు ? “అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే చట్టానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన వారు గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది అంటూ తెలిపారు ఏసిపి. ఏది ఏమైనా అల్లు అర్జున్ చేస్తున్న తప్పిదాలను ఒక్కొక్కటిగా ఆయన బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.