Allu Arjun : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ మూవీ ప్రీమియర్ షోలో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది.. ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ కేసు మొత్తం పూర్తిగా అల్లు అర్జున్ మెడకి చుట్టుకుంటుంది.. అల్లు అర్జున్ చేసిన కొన్ని తప్పులే కారణం అని కొందరు చెబుతున్నారు.. ఇంతకీ అల్లు అర్జున్ చేసిన తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సంధ్య థియేటర్ వద్ద..( ముసీరాబాద్ మెట్రో స్టేషన్ టు సంధ్య థియేటర్ వరకు రోడ్ షో.. )
డిసెంబర్ 5 న పుష్ప 2 రిలీజ్ అవ్వగా ఒకరోజు ముందుగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ప్రీమీయర్ షోలు పడ్డాయి.. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్ లో సంధ్య థియేటర్ కు పుష్ప 2 రావడానికి అనుమతి కోరారు. కాని జనాలు ఎక్కువగా ఉన్నారు వద్దని రాత పూర్వకంగా చెప్పారు. అయితే పోలీసులను లెక్క చెయ్యకుండా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో థియేటర్ కు చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్ ముసీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్య థియేటర్ వరకు ర్యాలీతో వెళ్లారు. తమ అభిమాన హీరో వస్తున్నారని అభిమానులు ఒక్కసారిగా థియేటర్ లోకి దూసుకొని వచ్చారు. దాంతో పోలీసులు కంట్రోల్ చెయ్యలేక పోయారు. తొక్కిసలాట జరిగింది. ఒక నిండు ప్రాణం పోయింది, మరో పసి ప్రాణం పోయింది.. అల్లు అర్జున్ మాత్రం ఏమి ఎరుగనట్లు వెళ్ళేటప్పుడు కూడా అభివాదం చేస్తూ రోడ్ షో చేశాడు.
వీడియో సందేశం రిలీజ్..
థియేటర్లో తన ఫ్యామిలీతో సినిమా చూస్తున్నారు. ఆ సమయంలోనే పోలీసులు మహిళ మృతి చెందినదని చెప్పి బయటకు తీసుకొచ్చారు. కానీ తర్వాత రోజు పొద్దునే అల్లు అర్జున్ వీడియోను రిలీజ్ చేశాడు. రేవతి అనే మహిళ మృతి చెందింది.. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఆమెకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. కాని పోలీసులు మాత్రం ముందే చెప్పి తీసుకొచ్చామని అంటున్నారు.
ఆర్థిక సాయం..
సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాబు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్నాడు. ఆరోగ్యం కాస్త నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడే అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేసి ఉంటే బాగుండేది. కాని ఆలస్యంగా సాయం ప్రకటించారు.
అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రమోషన్స్..
అల్లు అర్జున్ ను పోలీసులు ఆయన ఇంటికి అరెస్ట్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆయన గ్రీన్ కలర్ టీ షర్ట్ లో కనిపించారు. క్షణాల్లో వెళ్లి టీ షర్ట్ ను మార్చుకున్నాడు. దానిపై వైల్డ్ ఫైర్ అని పుష్ప అని రాసి ఉంది. అంటే బన్నీ ప్రమోషన్స్ చెయ్యడం మాత్రం తగ్గలేదు.
బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత..
సంధ్య థియేటర్ తొక్కిసలాట లో రేవతి మృతి చెందారు. ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే విడుదల చేశారు. విడుదల అయిన తర్వాత ఐకాన్ అనే పేరు ఉన్న టీ షర్ట్ ను వేసుకొని తనని పరామర్శించడానికి వచ్చిన హీరోలను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు..
ప్రెస్ మీట్..
సంధ్య థియేటర్ ఘటన తీవ్రంగా మారింది. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ప్రస్థావించిన తర్వాత రెస్పాండ్ అయ్యాడు. ఆ వ్యాఖ్యలలో నిజం లేకుంటే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? సీఎం వ్యాఖ్యలు తప్పు అని లీగల్ డిపార్ట్మెంట్ ను దించాలి. లేదా తన తండ్రి లేదా వేరొకరితో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కాని అల్లు అర్జున్ స్వయంగా చెప్పడం అందరికి అనుమానాలు వ్యక్తం అయ్యేలా కనిపిస్తుంది.
ఇవన్నీ బన్నీ చేసిన మిస్టేక్స్.. అందుకే ఈ వివాదం మెడకు చుట్టుకుంది. ఇక పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు కీలకంగా మారాయి.. ఇక బెయిల్ రద్ధయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. చూద్దాం ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో..