E-Paper
Advertisement

Horoscope  Today December 24th:   ఆ రాశివారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది

Horoscope  Today December 24th:   ఆ రాశివారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 24న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో విబేధాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకొడిగా సాగుతాయి. అన్నిరంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలం లో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.

   

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు సంతానానికి సంబంధించిన విద్య  విషయాలపై దృష్టి సారించడం మంచిది. దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయం లో శ్రద్ద వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు  సహోద్యోగులతో ఉన్న  వివాదాలు తొలగిపోతాయి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×