BigTV English

Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్ చేసిన మిస్టేక్ ఇదే.. అడ్డంగా దొరికిపోయాడు..

Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్ చేసిన మిస్టేక్ ఇదే.. అడ్డంగా దొరికిపోయాడు..

Raj Tarun-Lavanya: ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారమే.. తన బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ తనని శారీరకంగా వాడుకొని వదిలేసాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టింది. ఆ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. కానీ ఇప్పటికే దానికి పూర్తిగా సొల్యూషన్ మాత్రం దొరకలేదని తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ మ్యాటర్ సైలెంట్ అయ్యింది.  మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు దీని గురించే చర్చ. ప్రైమ్ టైం న్యూస్ లో కూడా రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట్టు వీళ్లిద్దరి వ్యవహారం గురించి లైవ్ డిబేట్స్ జరిగాయి. ఎప్పుడైతే శేఖర్ బాషా మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి, లావణ్య కి సంబంధించిన ఆడియో రికార్డ్స్ అన్నిటిని బయటపెట్టాడో, అప్పటి నుండి లావణ్య ఆడుతున్నది నాటకాలే అని అత్యధిక శాతం మంది నమ్మారు. అయితే కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ కేసు ఇప్పుడు మరోసారి హైలెట్ అవుతుంది..


రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గొడవలు..

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య దగ్గరకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో కలిసి ఉన్నారు. ఆ ఇంటిని లావణ్యకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూ లో రాజ్ తరుణ్ అన్నారు. కెరీర్ ప్రారంభం లో నేను ఇబ్బంది పడుతున్న రోజుల్లో లావణ్య నాకు సహాయంగా నిల్చింది, ఆ కృతజ్ఞతతోనే లావణ్య ని ఆ ఇంట్లో ఉండనిచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్.. అయితే ఈమధ్య రాజ్ తరుణ్ చేస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆర్థిక పరిస్థితులు లేవు. దాంతో రాజ్ తరుణ్ పేరెంట్స్ మా సొంత ఇంట్లో మేము ఉంటామంటూ లావణ్య ఇంటికి వెళ్లారు. అక్కడ లావణ్య వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా బయటికి గెంటేసింది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం పోలీసులు ఎంట్రీ తో గొడవలు సర్దుమనగడం జరిగాయి.


రాజ్ తరుణ్ వల్ల ప్రాణ భయం..

రాజ్ తరుణ్ పేరెంట్స్ పోలీసులు చెప్పడంతో వెళ్లిపోయారు. అక్కడితో ఆ గొడవ పూర్తయిందని అనుకుంటే తప్పే. లావణ్య రీసెంట్గా మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నాకు న్యాయం జరగాలి అంటూ మొరపెట్టుకున్న తెలుస్తుంది. అయితే పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదంటూ మీడియాతో ఆమె ముచ్చటించింది. నాకు రాజ్ తరుణ్ వల్ల ప్రాణహాని ఉంది దాని బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అంటూ మీడియాతో మాట్లాడింది లావణ్య. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కూడా ఆమె వైపు ఉన్నారని ఓ వార్త అయితే నెట్టింటా ప్రచారంలో ఉంది.

Also Read:పబ్లిక్ గానే ముద్దు అడిగారు.. హీరోయిన్ లైఫ్ లో షాకింగ్ ఘటన..

రాజ్ తరుణ్ చేసిన మిస్టేక్..

మనిషి జీవితంలో చేసిన ఒక చిన్న పొరపాటే జీవితాంతం బాధపడేలా చేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ రాజ్ తరుణ్. ఇష్టపడి రిలేషన్ లో ఉండడం వేరు బలవంతంగా రిలేషన్ ని మెయింటైన్ చేయడం వేరు అని ఈయన చాలా సందర్భాల్లో బయట పెట్టారు. అయితే లావణ్యతో రిలేషన్ లో ఉండడమే కాదు. లావణ్య ను పెళ్లి చేసుకున్నట్లు కూడా ఓ వీడియో బయటకు వచ్చింది. రాజ్ తరుణ్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే అని ఆ వీడియోని చూసిన నెటజన్లు కామెంట్లు చేస్తున్నారు.. పెళ్లి వరకు వెళ్లడం, ఇప్పుడు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది అని వదిలేసాడు. ఎటు చూసిన అతనే తప్పు చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఈ కేసు రోజుకో మలుపు తిరగడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఎండ్ ఎప్పుడు పడుతుందో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×