Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను చంపాలనుకున్న వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అనామిక చెప్తుంది. వాళ్ల మీదనే కాదు అనామిక బాబ్జీని వెనకుండి నడిపిస్తున్నవ వాళ్లు ఎవరో కూడా కనుక్కోవాలి. అప్పుడు అందరినీన పోలీసులకు పట్టించాలి అంటాడు అమర్. అందుకోసం మళ్లీ కొడైకెనాల్ వెళ్లాలని డిసైడ్ అవుతాడు. సమస్య మొదలైన చోట పరిష్కారం వెతుకుతాను. ఈసారి ఒక భర్తలా కాకుండా ఒక మిలటరీ వాడిలా సమాధానాలు వెతుకుతా అంటూ భాగీ రేపు ఉదయమే మనం కొడైకెనాల్ వెళ్తున్నాం. రాథోడ్ రేపు ఉదయమే టికెట్స్ బుక్ చేయ్..మనోహరి నువ్వు కూడా మాతో కొడైకెనాల్ రావాలి అని చెప్తాడు.
మనోహరి కంగారుగా.. నేనా నేనేందుకు రావాలి అమర్ అని అడుగుతుంది. దీంతో అమర్, ఆరు చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా..? ఇప్పుడు కూడా ఉంటే ఆరోజు ఏం జరిగిందో ఎలా జరిగిందో కనిపెట్టడానికి హెల్ప్ అవుతావు అని చెప్పగానే.. మనోహరి సరే అమర్ వస్తాను అంటుంది. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మనోహరి మాత్రం నన్ను పట్టుకోవడానికి నేనే హెల్ప్ చేయాలా..? అమర్ పక్కన ఉండి అమర్ కు దొరక్కుండా ఎలా ఉండాలి. అని మనసులో అనుకుంటూ భయపడుతుంది.
స్కూల వచ్చిన అంజు కారు దిగగానే స్టైలిష్‌గా డాన్స్ చేస్తూ వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. దగ్గరకు వచ్చిన అంజు హలో మిస్సమ్మ ఇక నుంచి రెండు నెలలు మా షూస్ రాక్‌లో ఉండాలి. సాక్స్ కప్‌బోర్డులో ఉండాలి. మా బుక్స్ బ్యాగ్స్ మా కంటికి కనబడకుండా ఉండాలి అంటుంది. దీంతో మిస్సమ్మ ఏ నీకు ఇంట్లో ఉండాలని లేదా అని అడుగుతుంది. అందరూ నవ్వుతారు. అంజు షాక్ అవుతుంది. ఇంతలో అంజు ఇంట్లోనే ఉంటాను.. అని చెప్పగానే ఏం స్కూల్‌లో నుంచి నిన్ను తరిమేశారా అంటాడు శివరాం. దీంతో అంజు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అది చెప్పడానికే ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నా అంటుంది. దీంతో అమ్ము కోపంగా ఒసేయ్ పొట్టి దానా అదేదో డైరెక్టుగా చెప్పొచ్చు కదే అంటుంది. దీంతో అంత డైరెక్టుగా చెప్పే విషయం కాదు అమ్ము అది నా ఎలివేషన్‌కు సరిపడే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి అంటుంది.
ఇంతలో ఆనందం ఓసేయ్ పొట్టిదానా.. ఎక్కువ చేయకే అసలే హాలిడేస్ అని ఏదైనా క్యాంపు అన్నారనుకో అంటాడు. అలా ఎవరు అనరు అంటే నేను చూస్తూ ఊరుకోను అంటుంది అంజు. దీంతో మిస్సమ్మ ఆల్ రెడీ పొద్దునే డిసైడ్ చేశారు. మార్నింగ్ కరాటే క్లాస్ అని చెప్తుంది. మధ్యాహ్నం పెయింటింగ్ అని రాథోడ్ చెప్తాడు. ఈవెనింగ్ డాన్స్ క్లాస్ అని శివరాం చెప్తాడు. రాత్రికి వచ్చే సంవత్సరం సిలబస్ చదవాలి అని నిర్మల చెప్తుంది. వాళ్ల మాటలకు అంజు అక్కడే కూలబడి పోతుంది. నిమ్ము డార్లింగ్ అర్ద్రరాత్రి ఎందుకు వదిలేశారు. అప్పుడు కూడా ఏదో ఒకటి సెట్ చేయోచ్చు కదా..? కట్టిన డబ్బులు వెనక్కి తీసుకురండి. లిస్టులో మా పేర్లు తీసేయండి మేము ఏ క్లాస్ కు రామని వాళ్లకు ఇన్‌ఫాం చేయండి. ఇదే ఇంట్లో నిద్రకు కళ్లు మండి ఇబ్బంది పడ్డా.. ఎవరైనా అడ్డొస్తా మాటలతో టార్చర్ చేస్తా అంటుంది.
దీంతో మిస్సమ్మ ఇదే మాట మీ డాడీతో చెప్పు అనగానే అంజు భయంతో కళ్లు మూసుకుని మెల్లగా వెనక్కి తిరిగి చూసి అమర్ లేకపోవడంతో మిస్సమ్మ మీదకు కోపంగా వెళ్లి కూర్చుంటుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఇంతలో అనామిక మీకందరికీ ఒక గుడ్‌న్యూస్ చెప్పనా.. రేపు అందరం కొడైకెనాల్ వెళ్తున్నాం అని చెప్తుంది. దీంతో పిల్లుల డల్ అయిపోతారు. మిస్సమ్మ ఏమైంది..? పిల్లలు అని అడుగుతుంది. దీంతో అంజు అమ్మ లేకుండా కొడైకెనాల్ వెళ్లడం ఇదే ఫస్ట్ టైం. అమ్మ లేకుండా ఆ ఇంట్లో మనం అడుగుపెట్టగలమా..? అంటూ బాధపడుతుంటారు. దీంతో మిస్సమ్మ పిల్లలను మోటివేట్ చేస్తుంది. అమ్మకు దగ్గరగా ఉండాలని కోరుకోవాలి కానీ అమ్మకు దూరంగా ఉండాలని కాదు కదా..? అంటూ చెప్పగానే పిల్లలు కూల్ అవుతారు.
తర్వాత అందరూ హ్యాపీగా కొడైకెనాల్ బయలుదేరుతుంటే.. మనోహరి వచ్చి అనామికను నువ్వు కూడా కొడైకెనాల్ వస్తున్నావా..? అని అడుగుతుంది. అనామిక అవును అని చెప్తుంది. దీంతో మనోహరి పిల్లలకు హాలిడేస్ ఇచ్చాక కేర్ టేకర్‌తో ఏం పని ఉంటుంది. అందుకే ఈ అమ్మాయిని కొడైకెనాల్ వద్దని చెప్తున్నాను అని అమర్‌కు చెప్తుంది. అమర్ కూడా కరెక్టుగా చెప్పావు మనోహరి అంటాడు అమర్. దీంతో అనామిక నాకు రెస్ట్ అవసరం లేదు. పిల్లల్ని చూసుకోవడమే నాకు ఇష్టం అంటుంది. దీంతో అమర్ నువ్వు ఇష్టం అన్నా నాకు అది కష్టం లాగే కనిపిస్తుంది అనామిక. నువ్వొక కేర్‌టేకర్ గా అయితే కొడైకెనాల్ రానవసరం లేదు. అని అమర్ చెప్పగానే.. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అనామిక షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?