OTT Movie : హారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలను చూడటానికి కొంతమంది చాలా ఉత్సాహం చూపిస్తారు. వీటిలో ఉండే సౌండ్ ఎఫెక్ట్స్, సస్పెన్స్ ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక అపార్ట్మెంట్లో, కొత్తగా పెళ్లయిన జంట ఉండే ఫ్లాట్లో జరుగుతుంది. ఆ ఫ్లాట్లో ఇదివరకే ఒక మిస్టరీ రహస్యం దాగి ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఒక ఊపు ఊపుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్లాట్ నెం. 609’ (Flat no. 609). 2018 లో వచ్చిన ఈ మూవీకి అరిందం భట్టాచార్య దర్శకత్వం వహించారు. రాజా హాగే దీనిని నిర్మించారు. ఈ మూవీ ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అర్కో, సాయంతని అనే కొత్తగా పెళ్ళయిన జంట, కోల్‌కతాలోని రాజర్‌హాట్ ప్రాంతంలో కాపురం పెట్టాలనుకుంటారు. బడ్జెట్‌కు తగిన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవడానికి వెతుకుతారు. పప్పు అనే బ్రోకర్ సహాయంతో, వారు ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంటారు. కానీ దానికి కొన్ని విచిత్రమైన షరతులు పెడతారు. ముఖ్యంగా ఒక లాక్ చేయబడిన స్టోర్‌రూమ్‌ను తెరవకూడదనే నిబంధన పెడతారు. ఈ షరతులకి ఒప్పుకుని వారు ఫ్లాట్‌లోకి మారతారు. ఫ్లాట్‌లోకి మారిన కొద్ది రోజుల్లోనే, సాయంతని అసాధారణమైన సంఘటనలను గమనిస్తుంది. అర్కో తన ఐటీ ఉద్యోగం కారణంగా తరచూ పర్యటనల్లో ఉంటాడు. దీంతో సాయంతని ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. ఈ సమయంలో ఆమె భయంకరమైన అనుభవాలను ఎదుర్కుంటుంది. టీవీలో ఒక చిన్నారి నీడ కనిపించడం. బంతి మెట్లపై దానంతట అదే గెంతడం, లాక్ చేయబడిన స్టోర్‌రూమ్ వద్ద విద్యుత్ ఆటంకాలు వంటివి జరుగుతూ ఉంటాయి.
పొరుగున ఉన్న వృద్ధ దంపతులు మాత్రం అనుమానస్పదంగా వ్యవహరిస్తారు. ఆ ఫ్లాట్ గురించి ఏదో చెడు పుకారు ఉన్నట్లు సాయంతని తెలుసుకుంటుంది. సాయంతని తన స్నేహితురాలితో పాటు, అర్కోతో కూడా ఈ విషయాలను పంచుకుంటుంది. కానీ వారు ఆమె మానసిక ఆందోళన కారణంగా ఇలా ఊహించుకుంటోందని భావిస్తారు. సాయంతని ఇక చేసేదేమి లేక, తన తండ్రికి దీని గురించి సమాచారం ఇస్తుంది. ఆయన పోలీసుల సహాయం తీసుకుని ఏం జరుగుతుందో, తెలుసుకోవాలని అనుకుంటాడు. ఊహించని ట్విస్ట్‌తో, ఫ్లాట్ కి సంబంధించిన రహస్యం క్లైమాక్స్‌లో వెల్లడవుతుంది. ఈ రహస్యం సాయంతని ఎదుర్కొన్న పరానార్మల్ సంఘటనలకు, పొరుగువారి విచిత్రమైన ప్రవర్తనకు సంబంధించి ఉంటుంది. చివరికి ఈ సినిమా హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలను కలిపి, బెంగాలీలో ఒక విజయవంతమైన సినిమాగా తెరకెక్కింది.
Read Also : అర్ధరాత్రి కూతురి స్కర్ట్ లేపి చూసే తండ్రి… అజ్ఞాత వ్యక్తి అడుగు పెట్టడంతో ఊరు ఊరంతా వల్లకాడుగా…