BigTV English

Samantha – Naga Chaitanya Divorce: సమంత ఫోన్ ట్యాపింగ్.. చై – సామ్ విడాకులకు అసలు కారణం తెలిసిపోయింది..?

Samantha – Naga Chaitanya Divorce: సమంత ఫోన్ ట్యాపింగ్.. చై – సామ్  విడాకులకు అసలు కారణం తెలిసిపోయింది..?


Samantha- Naga Chaitanya Divorce Reason: అక్కినేని నాగ చైతన్య- సమంత విడిపోయి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఇప్పటివరకు వీరు విడిపోవడానికి కారణం ఏంటి అన్న విషయం వారికి తప్ప ఎవరికి తెలియదు. ఎప్పుడైతే వీరు విడాకులు ప్రకటించారో.. అప్పటినుంచి రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవి నిజమో కాదో అన్నది మాత్రం ఎవరు ధృవీకరించకపోవడంతో అవి రూమర్స్ గానే నిలిచాయి. కొంతమంది సమంత సినిమాలు చేయడం వలన అని, ఇంకొందరు చై కు వేరొక అమ్మాయితో సంబంధం ఉండడం వలన అని, మరికొందరు అక్కినేని ఫ్యామిలీ వలన అని.. ఇలా ఎన్నో పుకార్లను విని ఉన్నాం. అందులో ఏది నిజం కాదు. ఇక మా విడాకుల గురించి వదిలేసి మీ పని మీరు చేసుకోండి అని సామ్ డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇచ్చినా కూడా ఫ్యాన్స్ మాత్రం  ఈ విషయాన్నీ వదలడమే లేదు. ఎప్పుడు వీరి విడాకుల గురించి వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది.

ఇక తెలంగాణలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అధికారులు.. తమ సొంత పనులు కోసం చట్టపరమైన పర్మిషన్స్ తీసుకోకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. దీనివలన చాలామంది ప్రముఖుల బాగోతాలు బయటపడ్డాయి. అలా బయటపడిన కథల్లో సమంత కథ కూడా ఒకటి. అవును.. గత కొన్నిరోజులుగా సమంత ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ట్యాపింగ్ వలనే సామ్- చై విడిపోయారని సమాచారం. సమంత, నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిండా నాలుగేళ్లు నిండకుండానే వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. అందుకు కారణం చాలా పర్సనల్ అని టాలీవుడ్ లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. అదే సామ్ ఫోన్ ట్యాపింగ్ లో బయటపడిందని అంటున్నారు.


Also Read: RC 16: రామ్ చరణ్ ‘ఆర్సీ 16’ నుంచి క్రేజీ అప్డేట్ అందించిన దర్శకుడు.. వీడియో వైరల్

ఇక ఆ ఫోన్ ట్యాపింగ్ లో బయటపడ్డ అంశం ఏంటంటే.. పెళ్లి తరువాత నుంచి సామ్ ఒక రకమైన సినిమాలు చేసుకుంటూ వస్తుంది.  ఆ సమయంలోనే ఆమెకు ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఆఫర్ వచ్చింది.  ఇండస్ట్రీలో  స్టార్ హీరోయిన్స్ కు వచ్చినట్లే సామ్ కు కూడా ఒక ఆఫర్ వచ్చింది. ఇందులో అవకాశం కావాలంటే తాము ఎక్కడకు రమ్మంటే అక్కడకు రావాలని అడిగారట. అందుకు సమంత కూడా ఓకే చెప్పిందట. ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ లో బయటపడడం.. అధికారుల్లో కొంతమంది నుంచి ఆ సమాచారం అక్కినేని కుటుంబానికి చేరడంతో గొడవ మొదలైందని, అలా స్టార్ట్ అయిన ఈ విబేధాలు చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకు దారితీసిందని చెప్పుకొస్తున్నారు. దీని మీద పలు ఛానెల్స్ డిబేట్ కూడా చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మరి ఇందులో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇవేమి పట్టించుకోని సామ్.. తన కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ తో బిజీగా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్సే ఈ సిరీస్ ను కూడా తెరకెక్కించడం విశేషం.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×