BigTV English

PM Modi : బెంగాల్ బీజేపీ అభ్యర్థులకు ప్రధాని ఫోన్.. రాజమాతతో మాట్లాడిన మోదీ..

PM Modi : బెంగాల్ బీజేపీ అభ్యర్థులకు ప్రధాని ఫోన్..  రాజమాతతో మాట్లాడిన మోదీ..
PM Modi
PM Modi

PM Modi: సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.


తాజాగా కృష్ణానగర్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్ కు మోదీ ఫోన్ చేశారు. ఆమెతో ముచ్చటించారు. పశ్చిమ బెంగాల్ లో పేదల నుంచి దోచి అక్రమార్కులు కూడబెట్టిన ఆస్తులను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయన్నారు. ఈ ఆస్తులను పేదలకే తిరిగి దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఓటర్లు మార్పు కోరుకుంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ లో 42 లోక్ సభ స్థానాలున్నాయి. ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య గట్టి పోటీ నెలకొంది. కృష్ణానగర్ స్థానంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎందుకంటే టీఎంసీ అభ్యర్థిగా ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మహువా మొయిత్రా పోటీలో ఉన్నారు. ఆమెకు దీటుగా బీజేపీ రాజమాత అమృతా రాయ్ ను బరిలోకి దించింది.


Also Read: మహారాష్ట్రలో కిచిడీ రాజకీయం.. ఎంవీఏ కూటమిలో భగ్గుమన్న విభేదాలు   

కృష్ణానగర్ లో రాజ కుటుంబానికి గట్టి పట్టుంది. అయితే 2009 నుంచి ఇక్కడ టీఎంసీ అభ్యర్థే గెలుస్తున్నారు. 2019లో మహువా మొయిత్రా బీజేపీ అభ్యర్థిపై 60 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.

మహువా మొయిత్రాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమె పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే గతేడాది మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో కృష్ణానగర్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో రాజమాతను బరిలోకి దించింది.

ప్రధాని మోదీ మంగళవారం కూడా బెంగాల్ కు చెందిన ఓ బీజేపీ అభ్యర్థితో మాట్లాడారు. బశీర్హాట్‌ లోక్‌సభ స్థానం నుంచి రేఖా పాత్రా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. ఎందుకంటే సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్ అయ్యారు. షాజహాన్ షేక్ పై అరాచకాలకు వ్యతిరేకంగా రేఖా పాత్ర పోరాడారు. అందుకే ఆమె శక్తి స్వరూపంగా పేర్కొంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. సందేశ్ ఖాలీ ప్రాంతం బశీర్హట్ లోక్ సభ స్థానం పరిధిలో ఉంది. అందుకే  ఆమెను బీజేపీ ఇక్కడ నుంచి పోటీకి దించింది.

Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×