E-Paper
Advertisement

Akhanda 2 Remuneration : అఖండమైన రెమ్యునరేషన్… బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఈ మూవీకే..

Akhanda 2 Remuneration : అఖండమైన రెమ్యునరేషన్… బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఈ మూవీకే..
Advertisement

Akhanda 2 Remuneration : అందరి హీరోల్లో కాదు బాలయ్య (Balakrishna). కొత్తగా వచ్చిన హీరోలు కూడా కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటే, బాలయ్య మాత్రం ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించి, తనకు సరిపోయేంత మాత్రమే తీసుకుంటాడు. గతంలో చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే అందరివాడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు రాబోయే అఖండ 2 (Akhanda 2) మూవీకి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఎంతలా అంటే, బాలయ్య కెరీర్‌లోనే ఇదే హైయెస్ట్ అంటా.. రెమ్యునరేషన్ విషయంలో చాలా మంది హీరోలను కూడా దాటేశాడని టాక్ వస్తుంది. అంతలా ఎంత పెద్ద మొత్తం తీసుకుంటున్నాడో ఇప్పుడు చూద్ధాం…

నందమూరి వంశంలో ఎన్టీరామారావు తర్వాత, ఆయన వారుసుల్లో సరిగ్గా లెగసీని కంటీన్యూ చేసింది బాలయ్య మాత్రమే. నందమూరి నటసింహం అనే పేరుతో ఇప్పటికే 108 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఇప్పుడు 109వ సినిమా రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. 110వ సినిమా ఈ రోజే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో బాలయ్య తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.

Advertisement

అందరికీ అందుబాటులో ఉండే అందరివాడు…

బాలయ్య… చూడటానికి గంభీరంగా, గర్జించే సింహంలా కనిపించినా, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని అంటుంటారు. అలాగే రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ డిమాండ్స్ కూడా ఉండవంట. ఇండస్ట్రీ కొత్తగా వచ్చి ఒకటి ఆర హిట్స్ కొట్టిన వాళ్లు కూడా కోట్లల్లో డిమాండ్ చేస్తే, బాలయ్య 100పైగా సినిమాలు చేసినా, పారితోషికం విషయంలో నిర్మాతల దగ్గర డిమాండ్స్ ఏం ఉండవు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అంతే కాదు… బాలయ్య అందరికీ అందుబాటులో ఉండే అసలైన అందరివాడు అని కూడా అంటారు.

Advertisement

ఆయన లాస్ట్ సినిమాల రెమ్యునేషన్స్…

బాలయ్య చివరి మూడు సినిమాల రెమ్యునరేషన్స్ ను ఒకసారి గమనిస్తే…
వీర సింహా రెడ్డికి బాలయ్య తీసుకున్నది కేవలం 14 కోట్లు మాత్రమే. ఈ మూవీ అప్పట్లో 140 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక భగవంత్ కేసరి మూవీకి బాలయ్య రెమ్యునరేషన్ 18 కోట్లే. ఈ సినిమా 130 కోట్లు తీసుకొచ్చింది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న NBK109 మూవీకి బాలయ్య 30 కోట్లు తీసుకున్నారట. అది కూడా నిర్మాతలు ఫోర్స్ చేయడం వల్లే ఒప్పుకున్నాడట.

అఖండ 2కి బాలయ్య పారితోషికం…

బోయపాటి – బాలయ్య కాంబోలో వచ్చిన మూడు సినిమాలు (సింహా, లెజెండ్, అఖండ) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో లాస్ట్ మూవీ అఖండ అయితే కరోనా, ఏపీలో టికెట్స్ ఇష్యూ లాంటిది ఉన్నా.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటి మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అఖండ 2 – తాండవం అనే ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది.

అయితే ఈ మూవీకి బాలయ్య భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీకి బాలయ్య 50 నుంచి 54 కోట్ల వరకు అందుకుంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ వార్త నిజమే అయితే, బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోవడమే కాదు, రెమ్యునరేషన్ విషయంలో చాలా మంది హీరోలను దాటేసినట్టే…

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×