BigTV English

Amala Paul : అయ్యయ్యో అమలా పాల్ కి ఏమైంది? ఇలా మారిపోయిందేంటి!!

Amala Paul : అయ్యయ్యో అమలా పాల్ కి ఏమైంది? ఇలా మారిపోయిందేంటి!!

Amala Paul : బోల్డ్ బ్యూటీ అమలాపాల్ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు చూసిన అమలా పాల్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ హీరోయిన్ కి ఏమైంది ఇంతలా మారిపోయింది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సింపుల్ గా రెడీ అయ్యి, తన కొడుకుతో క్యూట్ గా ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే నిజానికి ఈ ఫోటోలను ఓ సంస్థ ప్రమోషన్ లో భాగంగా పోస్ట్ చేసినట్టుగా సమాచారం. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి అమలా పాల్ లో వచ్చిన మార్పును చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఆ ఫోటోలలో అమలా పాల్ ఫేస్ చాలా మారిపోయినట్టుగా కనిపించింది. దీంతో అమలా పాల్ ఇలా మారిపోయింది ఏంటి ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ముద్దుగా కనిపించిన అమలా పాల్ ఇప్పుడు బొద్దుగా తయారై కనిపించడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

కాగా ఈ బ్యూటీ దక్షిణాది చిత్రపరిశ్రమలో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కానీ ఆ తర్వాత అవకాశాలు ఏమీ రాకపోవడంతో మలయాళ, తమిళ చిత్రాలపై ఫోకస్ చేసింది. అక్కడ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే పెళ్లి చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ కేఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ బంధాన్ని ఎక్కువ రోజులు సాగించలేదు. ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అలరించిన అమలా పాల్ 2023లో కేరళలోని కొచ్చిలో జగత్ దేశాయ్ అనే బిజినెస్ మాన్ ను ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంది. అదే ఏడాది జూన్లో కొడుకు పుట్టాడు. అమలా పాల్ తన కుమారుడికి ఇలై అని పేరు పెట్టింది.


కొడుకుతో కలిసి తాజాగా తాను పాల్గొన్న యాడ్ షూట్ కు సంబంధించిన ఫోటోలని షేర్ చేయగా, అందులో బొద్దుగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది అమలాపాల్. అయితే తల్లయ్యాక అమ్మాయిలు అందరూ కాస్త బొద్దుగా మారడం అన్నది సర్వ సాధారణ విషయం. ఓనం సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 15న అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ అమలా పాల్ తన కొడుకు ఫేస్ ను రివిల్ చేసింది. అందులో భాగంగా కొడుకు భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటిదాకా చాలామంది హీరోయిన్లు ఇలా మారి, ఆ తర్వాత సన్నబడ్డారు కూడా. ఇక తల్లయ్యాక అమలాపాల్ అడపా దడపా సినిమాలు చేస్తోంది. కాగా ఇక ఇదే ఏడాది జూలైలో థియేటర్లలోకి వచ్చిన అమలాపాల్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘లెవెల్ క్రాస్’ అనే సినిమా ఈనెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×