BigTV English

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు బీజీఎం చప్పిడి పప్పులా ఉండడానికి కారణం అతడేనా..?

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు బీజీఎం చప్పిడి పప్పులా ఉండడానికి కారణం అతడేనా..?

Tiger Nageswara Rao: దసరా బరిలోకి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య దిగిన మాస్ మహారాజ్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈసారి దసరా పండగ కు విజయ్ లియో, బాలయ్య భగవంత్ కేసరి తో పోటీకి దిగిన టైగర్ నాగేశ్వరరావు మిగిలిన రెండు సినిమాలతో పోల్చుకుంటే కాస్త వెనకబడింది. అయితే దీనికి ప్రధానంగా కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్న వాదన అక్కడక్కడ వినిపిస్తోంది. నిజానికి సినిమాకి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేవి వెన్నెముక లాంటివి. అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సినిమా అంత సాలిడ్ హీట్ అవుతుంది.


సినిమాలో సీన్స్ అక్కడక్కడ కాస్త సాగదీసినట్లుగా ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ గా పడితే మాత్రం ఆ ఫీల్ కారణంగా సీన్ క్లిక్ అయిపోతుంది. హీరో వస్తుంటే..ఒకపక్క థియేటర్ స్క్రీన్ పై రక్తం చిందుతుంటే.. మరోపక్క విలన్ మనుషులు ఎగిరి పడుతుంటే ..విజువల్ ఇంతవరకు బాగుంటుంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా పడకపోతే ఎoత బీభత్సమైన సీన్ కూడా కామెడీగా ఉంటుంది. ఆ సీన్ ఫీల్ ను మనకు విజువల్ కంటే కూడా వెనక వచ్చే మ్యూజిక్ ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తుంది.

ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ..ఫట్ అవ్వాలన్నా.. ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతి సినిమాకి పాటలకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా ఫస్ట్ సింగిల్.. సెకండ్ సింగిల్ అంటూ నానా హడావిడి చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. సినిమాలో పాటలు ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి అని డైరెక్టర్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒక్క పదం సరిలేదనిపించినా, ఒక్క రాగం సెట్ కాలేదనిపించినా ..తిరిగి అది నచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటారు.


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంటే సరిపోతుందా.. ఇదేం లెక్క అనుకుంటున్నారా. నిజమండి బాబోయ్ ఇలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా క్లిక్ అవడం వల్ల రొటీన్ స్టోరీ తో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రాలు మన ముందు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి జైలర్, విక్రమ్ మూవీస్ కి అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ మూవీస్ కంటెంట్ ఇంటెన్సిటీని పెంచి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. జైలర్ లో రజనీకాంత్ ఇంటి మీదకు దాడి చేసిన దొంగల్ని షూటర్స్ కాల్చి చంపినప్పుడు.. అతని భార్య ,కోడలు భయపడి నుంచుంటే.. రజనీకాంత్ కూర్చుంటాడు.. అప్పుడు వెనక వచ్చే మ్యూజిక్ ఉంది చూడండి ఆ మూవీని మనం చూసే యాంగిల్ ని మారుస్తుంది. అదీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉన్న పవర్.

అలాగే తమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అఖండ ,వాల్తేర్ వీరయ్య లాంటి సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతాలు సృష్టించారు. అయితే టైగర్ నాగేశ్వరరావు విషయంలో మాత్రం బ్యాగ్రౌండ్ పెద్ద మైనస్ అని అంటున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ కుమార్.. మ్యూజిక్ డైరెక్టర్ కాక ముందు నటుడిగా అందరికీ బాగా పరిచయం. పైగా ఇతని ఖాతాలో మంచి మంచి సినిమాలకు మ్యూజిక్ అందించిన అనుభవము ఉంది. అయితే ఎందుకో ఈ చిత్రానికి మాత్రం సీన్స్ కి తగ్గ ట్యూన్స్ ని అందించలేకపోయాడు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ లో డోంట్ స్టాప్ డాన్సింగ్.. పూనకాలు లోడింగ్.. పాట థియేటర్ని ఒక ఊపు ఊపింది. అయితే టైగర్ నాగేశ్వరరావు లో ఆ రెంజ్ సాంగ్ ఒకటీ లేదు.

థియేటర్ కు వెళ్లిన మాస్ మహారాజ్ అభిమానులు ఇదేం దరిద్రం రా బాబు.. దీన్ని మ్యూజిక్ అంటారా అని తలలు పట్టుకుంటున్నారు. పని ఒత్తిడి ఎక్కువైన కారణంతోనే జీవి ప్రకాష్ కుమార్ సరియైన మ్యూజిక్ అందించలేకపోయాడు అని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం జీవి చేతుల్లో ధనుష్ కెప్టెన్ మిల్లర్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, కార్తీ జపాన్, అక్షయ్ కుమార్ ఆకాశం నీ హద్దురా లాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. పని భారం ఎక్కువ కావడంతో మంచి మ్యూజిక్ రాలేకపోయింది.. ఏదిఏమైనాప్పటికీ జీవి దగ్గర నుంచి డైరెక్టర్ వంశీ సరియైన మ్యూజిక్ రాబట్టుకోలేకపోయాడు అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×