BigTV English

Sreeleela: ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలా..!

Sreeleela: ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలా..!
Sreeleela
Sreeleela

Sreeleela: ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రెటీలు తమకున్న పాపులారిటీతో కొత్త కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తుంటారు. మరికొందరైతే పలు ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ కోవలోకి తాజాగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వచ్చింది. అయితే ఆమె దేనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉందో అనే విషయానికొస్తే..


ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న నటీమణులలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. ‘పెళ్లి సందడి’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఈ మూవీ మంచి హిట్ అందుకోవడంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.

అయితే ఈ మూవీలో తన అందం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇక ఈ మూవీ తర్వాత శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోలేదు. గతేడాదిలో దాదాపు 8 సినిమాలలో నటించి ఎవరికీ అందని అవకాశాలను సొంతం చేసుకుంది. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ టాక్‌ను అందుకున్నాయి.


Also Read: దసరా కాంబో రిపీట్.. మాస్ లుక్‌లో నాని ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్

ఇక అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ కథల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తోంది. తన వద్దకు వచ్చిన స్టోరీల్లో డిఫరెంట్‌గా ఉన్నవాటినే ఎంచుకుంటోంది. అందువల్లనే ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక సినిమాలతో పాటు ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తుంది.

ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారనే చెప్పాలి. అంతేకాకుండా ఫొటోలతో పాటు తనకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా తమ అభిమానులతో పంచుకుంటు ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన శ్రీచైతన్య విద్యాసంస్థలకు శ్రీలీలా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Also Read: పదేళ్లుగా ఆశపడ్డ.. చివరి కోరిక తీరకుండానే కన్ను మూసిన డేనియల్ బాలాజీ

అయితే అందుకు ఓ కారణం కూడా ఉందండోయ్.. ఇటీవలే శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ వార్తలు వైరల్‌గా మారాయి. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఇండియాలోనే తొలి స్థానంలో ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ శ్రీలీలను నియమించడం ద్వారా మరో ముందడుగు వేసిందని అన్నారు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×