BigTV English

Unhealthy Juice : రోడ్లపై జ్యూస్‌లు తాగుతున్నారా.. అయితే ఆ ప్రమాదం ఉన్నట్లే!

Unhealthy Juice : రోడ్లపై జ్యూస్‌లు తాగుతున్నారా.. అయితే ఆ ప్రమాదం ఉన్నట్లే!
Unhealthy Juice
Unhealthy Juice

Unhealthy Juice : ఉదయం పూట బహిరంగ ప్రదేశంలో నడవడం అనేది ఫిట్‌గా ఉండటానికి ఉత్తమమైన మార్గం. మీరు ఈ ఒక్క అలవాటును మీ దినచర్యలో చేర్చుకుంటే.. అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. నడక వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నడిచిన తర్వాత జ్యూస్ తాగడం ఈ రోజుల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలో నడక తర్వాత మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి సమీపంలోని జ్యూస్ స్టాల్స్ నుంచి జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. నిపుణులు కూడా ఉదయాన్నే జ్యూస్‌తో ప్రారంభించమని సలహా ఇస్తుస్తుంటారు. అయితే బయట దొరికే జ్యూస్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం..


పార్క్ లోపల జ్యూస్ స్టాల్స్ ఏర్పాటు చేసే వారు ముందుగానే రసాన్ని తీసి కంటైనర్లలో ఉంచి వినియోగదారులకు అందిస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏదైనా పండు లేదా కూరగాయల రసం తీసిన 20 నిమిషాలలోపు తాగడం మంచిది. ఎక్కువసేపు ఉంచినట్లయితే రసంలో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు పాడవుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు జ్యూస్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందలేరు.

Also Read : ఓవర్ వెయిట్.. జిమ్‌లో చేరే ఆలోచనలో ఉన్నారా?


ఆక్సీకరణ 

సాధారణంగా మిక్సర్ లేదా జార్ నుండి రసం తీస్తారు. అది పండ్లు లేదా కూరగాయలు నుంచి కావచ్చు. అయితే దీని వల్ల వాటి ఆక్సీకరణ స్థాయి పాడైపోతుంది. అంటే.. జ్యూసర్ నుండి రసం తయారు చేస్తున్నప్పుడు దాని నుంచి కొంత వేడి కూడా విడుదల అవుతుంది. రసంలో ఉండే పోషకాహారాన్ని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. గాలితో తాకినప్పుడు రసంలో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఆక్సిజన్‌తో ప్రతిస్పందిస్తాయి. ఇప్పటికే తీసిన రసం రంగు ముదురు రంగులో కనిపించడం వల్ల మీరు జ్యూస్ రంగును బట్టి ఇది తాజాగా తయారు చేయబడిందా లేదా ముందుగా తయారు చేయబడిందా అని గుర్తించవచ్చు.

చేదురసం

పండ్లు కాకుండా.. ఇప్పుడు ప్రజలు ఆరోగ్యం కోసం కూరగాయల రసం కూడా తాగడం ప్రారంభించారు. ఇందులో కాకరకాయ రసానికి మంచి గిరాకీ ఉంది. ఎందుకంటే ఇది డయాబెటిస్ రోగులకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దీనిని తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. చేదుగా ఉండే రసం రక్తాన్ని కూడా పెంచుతుంది. కనీ చేదుగా ఉండే రసాలను రోజూ తాగకూడదు. వారానికి రెండుసార్లు తాగితే సరిపోతుంది. రోజూ తాగడం వల్ల కాలేయం ఓవర్ యాక్టివ్‌గా మారుతుంది. ఇది వివిధ రకాల సమస్యలను కలిగిస్తుంది. ఇది కాకుండా అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు కూడా సంభవించవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు కూడా డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే పొట్లకాయ రసాన్ని తాగాలి.

Also Read : వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా..?

రోడ్డు పక్కన లభించే జ్యూస్ ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే దాని తయారీ ప్రక్రియ, సమయం మీకు తెలియదు. అలానే జ్యూస్ పరిమాణాన్ని పెంచడానికి దుకాణదారులు చాలాసార్లు నీటిని కలుపుతారు. మురికి నీరు టైఫాయిడ్ వ్యాధికి కారణమవుతుంది. అందుకే వీలైనంత వరకు ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుని తాగాలి.

Disclaimer : నిపుణుల సలహా మేరకు ఈ కథనాన్ని సిద్ధం చేశాము. దీన్ని సమాచారంగా మాత్రమే చూడండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×