Big Stories

Controversy On Hardik Pandya : పాండ్యా పై ద్వేషమెందుకు? నిజంగా అతని తప్పుందా!?

Controversy On Hardik Pandya
 

Controversy On Hardik Pandya Latest Sports News: హార్దిక్‌ పాండ్య.. ఈసారి ఐపీఎల్‌లో హాట్ టాపిక్.. ముంబై కెప్టెన్‌గా సెలెక్ట్‌ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హార్దిక్‌పై హెట్రేట్ ఎంత పెరిగిందంటే.. పాండ్య కనిపిస్తే చాలు బూస్‌ చేస్తున్నారు. ఓ రకంగా హార్దిక్‌ ఇప్పుడు ముంబై ఫ్యాన్స్‌కు ఎనిమీ అయ్యాడు. మరి నిజంగా ఇందులో హార్దిక్ తప్పుందా? ఈ కాంట్రవర్సీ మొత్తం స్టార్టయ్యింది. ఈసారి ఐపీఎల్ సీజన్‌ స్టార్టయ్యే ముందు గుజరాత్‌ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు పాండ్యా. ఓకే.. ఇక్కడి వరకు బాగుంది.

- Advertisement -

కానీ విమర్శలు మొదలయ్యాయి. డబ్బు కోసమే పాండ్యా టీమ్ స్విచ్చయ్యాడన్నారు. కానీ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ.. రోహిత్‌ను పక్కన పెట్టేసి పాండ్యాకు కెప్టెన్సీని అంటగట్టిందో.. అప్పుడు మొదలైంది అసలైన కాంట్రవర్సీ.. పాండ్యాకు తగిలింది అసలైన సెగ.. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌, ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌ను తప్పింది. పాండ్యా లాంటి ప్లేయర్‌కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని.. రోహిత్ అండ్ ముంబై ఫ్యాన్స్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అది కాస్త చిరాగా.. ఆ తర్వాత కోపంగా మారింది. చివరికి పాండ్యాను ఓ శత్రువులా ట్రీట్‌ చేసే వరకు వెళ్లింది.

- Advertisement -

Also Read: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. టికెట్లు ఇప్పిస్తామంటూ సైబర్ మోసాలు..

దీనికి బెస్ట్‌ ఎగ్జాంపుల్.. అహ్మాదాబాద్‌లో గుజరాత్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్.. ఒకటి ఒకప్పుడు కెప్టెన్‌గా చేసిన టీమ్.. మరోకటి ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న టీమ్.. కానీ రెండు టీమ్‌ల ఫ్యాన్స్‌ నుంచి పాండ్యాకు కో ఆపరేషన్‌ లేదు. పాండ్యాను బూస్‌ చేశారు. ఇండియాలో ఓ ఇండియన్ ప్లేయర్‌ను బూస్‌ చేయడం.. హిస్టరీలో ఇదే ఫస్ట్‌ టైమ్ కావొచ్చు..

కెప్టెన్సీ మార్చితే ఇంత కాంట్రవర్సీ అవుతుందా? అన్ని టీమ్స్‌లో ఇదే జరుగుతుందా? అంటే నో అనే చెప్పాలి.. ఐపీఎల్‌లో మోస్ట్ ఫెవరేట్ టీమ్స్‌ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు టీమ్‌ల కెప్టెన్స్ కూడా మారారు. సీఎస్‌కే పగ్గాలు ధోని నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌కు వచ్చాయి..ఆర్సీబీ కెప్టెన్సీ కోహ్లీ నుంచి ఫాఫ్‌కు వచ్చాయి. కానీ అప్పుడు ఇంత కాంట్రవర్సీ కాలేదు. చాలా స్మూత్‌గా ట్రాన్సిషన్‌ జరిగింది. కానీ ముంబై ఇండియన్స్‌ విషయంలో ఫుల్‌ కాంట్రవర్సీ జరిగింది. ఆ రెండు టీమ్‌ల విషయంలో అది కోహ్లీ, ధోనిల చాయిస్.. కానీ ముంబై విషయంలో అలా జరగలేదు. ఆల్ ఆఫ్‌ సడెన్‌గా రోహిత్‌ ఉండగానే కెప్టెన్సీ మారిపోయింది..

మరి ఈ కాంట్రవర్సీలో పాండ్యా తప్పేం లేదా? అంటే ఉందనే అంటున్నారు ఫ్యాన్స్. పాండ్యా బిహేవియర్ మొదటి నుంచి వివాదస్పదమే. ఫస్ట్‌ మ్యాచ్‌లో బుమ్రాను కాదని.. తనే ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడం. అదే మ్యాచ్‌లో రోహిత్‌తో వ్యవహరించిన తీరు ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడం ఇలాంటి సీన్స్‌తో పాండ్యా మరోసారి కాంట్రవర్సీ కేరాఫ్‌గా మారాడు. ఇక సెకండ్ మ్యాచ్‌లో కూడా ఇదే సీన్స్ కనిపించాయి. సీనియర్స్‌ను అస్సలు లెక్క చేయకపోవడం కోచ్‌లకు మర్యాద ఇవ్వకపోవడం. మలింగను ఏకంగా పక్కకి నెట్టేయడం. ఆ మ్యాచ్‌లో SRH చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోవడం. ఈ రెండు మ్యాచ్‌ల్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అత్యంత దారుణంగా ఫెయిలయ్యాడు పాండ్యా.. ఇలా సీరిస్‌ ఆఫ్‌ సీన్స్‌తో మరింత కష్టాల్లో పడ్డాడు పాండ్యా.

Also Read: విరాట్ ఒక్కడు ఎంతకాలం లాగుతాడు: గవాస్కర్ ఆవేదన

ఒక్క హార్దిక్‌నే కాదు.. అతని వైఫ్‌ నటాషాను కూడా టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే హార్దిక్‌ను సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. టీమ్‌ను నడిపించేప్పుడు ఇలాంటి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు స్టీవ్ స్మిత్..
JUST FOCUS ON GAME… LEAVE EVERYTHING BEHIND.. అంటూ సలహాలు ఇస్తున్నాడు స్మిత్.. గతంలో స్మిత్ కూడా ఇలాంటి సీన్స్‌నే ఫేస్ చేశాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కొని బ్యాన్‌కు గురయ్యాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చీటర్‌ అంటూ టార్గెట్ చేసేవారు. మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే.. ఇవన్నీ పట్టించుకోవద్దని స్మిత్ ఇచ్చే సజేషన్.

ఏదేమైనా ప్రస్తుతం హార్దిక్‌పై హెట్రేట్ పీక్స్‌లో ఉంది. ఇందులో సగం పాపం ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌దే.. మరో సగం పాపం హార్దిక్ యాటిట్యూట్‌ది. మరి ఇప్పటికైనా మారతాడా? ఫ్యాన్స్‌ మనుసు గెలుచుకోవడంతో పాటు.. టీమ్‌కు కప్ అందిస్తాడా అన్నది చూడాలి. కానీ పాండ్యా మారకపోతే అతన్నే మార్చాల్సి వస్తుందా? అన్నది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగే.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News