BigTV English

Tirupati Prakash: టాలీవుడ్ లో క్రెడిట్ చిరంజీవికే.. నటుడు ఏమన్నారంటే..?

Tirupati Prakash: టాలీవుడ్ లో క్రెడిట్ చిరంజీవికే.. నటుడు ఏమన్నారంటే..?

Tirupati Prakash: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి, ఆయన చేసిన మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా తన సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు కష్టం వచ్చిన వారికి అండగా నిలుస్తున్నారు. అంతేకాదు ఆయన అభిమానులు కూడా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ ఎంతోమందికి ప్రాణదానం కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవితో పనిచేసిన చాలామంది ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు తిరుపతి ప్రకాష్ కూడా మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలు పంచుకొని చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు.


మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లి, స్వయంగా దోస వేసి వడ్డించారు..

తిరుపతి ప్రకాష్ (Tirupati Prakash) కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్నారు. చిరంజీవితో కూడా చాలా సినిమాలలో కలిసే నటించారు. ప్రత్యేకంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాలో వీళ్ళ కాంబినేషన్ సన్నివేశాలు కూడా బాగా సక్సెస్ అందుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ సినిమా సమయంలో జరిగిన విషయాలను సంఘటనలను గుర్తు చేసుకున్నారు ప్రకాష్. తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ.. “మాస్టర్ సినిమా చేసేటప్పుడు నేను బండ్ల గణేష్, వేణుమాధవ్, శ్రీకాంత్, ఉత్తేజ్, శివాజీ ఇలా ఇంకొంతమందిని ఇంటికి పిలిచి, చిరంజీవి స్వయంగా దోసెలు వేసి తినండి అని మాకు పెట్టారు. పచ్చడి కావాలా అని అడిగి మరీ ఆయన వేసేవాళ్ళు. అప్పుడు రాంచరణ్(Ram Charan)చాలా చిన్నవాడు. నాకు తెలిసి ఒక 14 సంవత్సరాలు ఉంటాయి. మాతో చాలా క్లోజ్ గా సరదాగా ఉండేవారు. ఇప్పటివరకు నేను ఎంతోమంది హీరోలతో పనిచేశాను. కానీ చిరంజీవి దగ్గర ఉన్నంత చనువు మరెవరి దగ్గర లేదు. ఆయన నటీనటులతో కలిసిపోయి మరి అందరిని సొంత వాళ్ళలా ఆదరిస్తారు” అంటూ తిరుపతి ప్రకాష్ తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి అందరితో సఖ్యతగా ఉంటారు.


మొదటిసారి కారవాన్ వాడిన హీరో చిరంజీవి..

టాలీవుడ్ లో ఈ క్రెడిట్ ఆయనకే సొంతం అంటూ తెలిపారు. అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి కారవాన్ వాడిన హీరో కూడా ఈయనే. మాస్టర్ సినిమా కోసం చిరంజీవి కారవాన్ ను ముంబై నుంచీ తీసుకొచ్చారు. అప్పట్లో ఇది చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. కారవాన్ ఉన్నా బ్రేక్ టైం లో బయటకు వచ్చి అందరితో కలిసి ఉండేవాళ్ళు. అంతేకాదు ఒకసారి మా అందరిని ఆ కారవాన్ లోనే ఎక్కించుకొని శ్రీశైలం కూడా తీసుకువెళ్లారు అంటూ చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు తిరుపతి ప్రకాష్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

చిరంజీవి సినిమాలు..

ఇక చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం చిరంజీవి సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘బింబిసారా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను మే నెలకు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ సినిమా చిరంజీవికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×