BigTV English

Naveen Polishetty: అయ్యయ్యో.. నవీన్ పొలిశెట్టికి ఎంత కష్టం వచ్చిందే.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Naveen Polishetty: అయ్యయ్యో.. నవీన్ పొలిశెట్టికి ఎంత కష్టం వచ్చిందే.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Naveen Polishetty: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి తన సినీ కెరీర్ మొదలు పెట్టి స్టాండప్ కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా హీరోగా ప్రమోషన్‌ అందుకున్నాడు. అతడు నటించిన ఫస్ట్ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. ఒక క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌గా తెరకెక్కిన ఈ మూవీ అతడి క్యారెక్టర్ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇందులో అతడు ఒక ఇన్వెస్టిగేటివి పాత్రలో నటించి అదరగొట్టేశాడు.


కాస్త కామెడీ, ఇంకాస్త కంటెంట్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటీ సినిమాను ఓ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టికి మంచి గుర్తింపు లభించింది. దీంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమా చేశాడు. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి పేరు మారుమోగిపోయింది. దీంతో నవీన్ పోలిశెట్టి అంటే జాతిరత్నం.. జాతి రత్నం అంటే నవీన్ పోలిశెట్టి అనే విధంగా మారిపోయాడు. కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో యాక్టింగ్ ఇరగదీసేశాడు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

Also Read: నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. మల్టీపుల్ ఫ్య్రాక్చర్స్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన హీరో


ఈ సినిమా తర్వాత అతడు నటించిన మరో సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ అందుకుంది. అయితే అదే సమయంలో నవీన్ పోలిశెట్టికి భారీ యాక్సిడెంట్ జరిగింది. అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అప్పట్లో అది చిన్న గాయమే అని అంతా అనుకున్నారు.. కానీ అతడి లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నా.. నవీన్ ఎక్కడా కనిపించకపోయే సరికి అతడి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.

దీంతో నవీన్ సోషల్ మీడియా వేదికగా అసలు విషయం బయటపెట్టాడు. తనకు యాక్సిడెంట్‌లో చాలా గాయాలయ్యాయని.. అస్సలు ఆ బాధ భరించలేకోతున్నానని ఓ వీడియో రిలీజ్ చేశాడు. పూర్తిగా కోలుకునే సరికి ఇంకొన్ని నెలల సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పడు అతడు మరో వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా అని తెలిపాడు. ఆ వీడియోను ఫన్నీ ఫన్నీగా చేసి పంచుకున్నాడు. తాను ఒక చేత్తో పడుతున్న కష్టాన్ని ఫన్నీగా చేసి చూపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయ్యయ్యో నవీన్ పోలిశెట్టికి ఎంత పెద్ద కష్టం వచ్చిందే అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×