BigTV English

Olympic Boxer Controversy: కాంట్రవర్శీ రింగ్ లో.. మహిళా బాక్సర్

Olympic Boxer Controversy: కాంట్రవర్శీ రింగ్ లో.. మహిళా బాక్సర్

Why Algerian boxer Imane Khelif is Creating a Controversy Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో మహిళా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ వివాదం ముదిరి పాకాన పడుతోంది. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట వివాదం రచ్చరచ్చగా మారింది. కొందరు ‘అమ్మా ఇమానే. నువ్వు బాక్సింగ్ రింగ్ లోకి వెళ్లాలి కానీ, కాంట్రవర్శీ రింగ్ లోకి వెళ్లావేంటి?’ అని కామెంట్లు చేస్తున్నారు.


అయితే చాలామంది అనేదేమిటంటే, అది లింగవివక్ష సమస్య. దానికి ఇమానె ఏం చేస్తుంది? దేవుడిచ్చిన సమస్యకు తనెందుకు బలికావాలి? అని అంటున్నారు. మొన్న బాక్సింగ్ రింగ్ లో ముక్కు పగలిన ఏంజెలాను ఉద్దేశించి కొందరు మాట్లాడారు. ఇప్పుడు నువ్వు ఎవరైతే కొట్టిన దెబ్బ గట్టిదని అన్నావో.. ఆ ఇమానె ఖెలీఫ్.. ఇప్పటికి మహిళల చేతుల్లో తొమ్మిది సార్లు ఓడిపోయింది తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు.

మరి ఆ మహిళలందరూ గెలిచారు కదా.. అని అడుగుతున్నారు. ఇలా వివాదం తీవ్ర స్థాయిలో చేరుతోంది. పలు దేశాల ప్రతినిధులు సైతం ఆమెను పోటీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇమానెకు ఐర్లాండ్ మాజీ ఛాంపియన్ అమీ బ్రాడ్ హర్ట్ మద్దతుగా నిలిచింది.


ఇక నెట్టింట బెదిరింపులు మానేయాలని కోరింది. విమర్శలు చేసేవారి మాటలు నిజమైతే తను అన్ని మ్యాచ్ ల్లో గెలవాలి కదా? అని ప్రశ్నించింది. మరి తొమ్మిది సార్లు ఎందుకు ఓడిపోయింది? అని అడిగింది. నిజానికి  ఒక పోటీలో తను కూడా ఖెలీఫ్ ను ఓడించింది.

ఈ అంశంపై ఒలింపిక్ కమిటీ స్పందించింది. సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హననం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసింది.  ఒక క్రీడాకారిణి గురించి ఇలా మాట్లాడకూడదు. అది ఆమెను మానసికంగా కుంగదీస్తుంది. భవిష్యత్తుపై బెంగపడేలా చేస్తుంది. ఇది మనుషులనేవారు చేసే పనికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇకపోతే ఒలింపిక్స్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్ లో  ఖెలీఫ్ ను హంగేరి బాక్సర్ లుకా హమోరీ ఢీ కొట్టనుంది. దీంతో తను మాట్లాడుతూ ఆమెతో తలపడటం కరెక్టా? కాదా? అని ఆలోచించడం లేదు. విజయం సాధించడం పైనే నా ఫోకస్ అంతా ఉందని తెలిపింది.

ఇకపోతే బౌట్ నుంచి తప్పుకున్నా ఏంజెలా కారినికి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ మద్దతుగా నిలిచింది. తనకి 50వేల డాలర్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఆమె దేశానికి 25 వేల డాలర్లు, కోచ్ కు 25 వేల డాలర్లు ఇస్తున్నట్టు ఐబీఏ ప్రెసిడెంట్ ఉమర్ క్రెమ్లెవ్ తెలిపారు. ఇంతకీ ఈ అసోసియేషన్ ఇమానె ఖెలిఫ్ ను పోటీల్లో పాల్గొనకూడదని, ఆమెపై నిషేధం విధించింది. అందుకనే ఏంజెలాకు మద్దతుగా నిలిచింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×