Social Media Towel Girl| సోషల్ మీడియా మాయలోపడి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా మంది పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కొందరు ప్రమాదకర బైక్ స్టంట్స్ చేస్తుంటే.. మరొకొందరు బకాసురుల్లా పది మంది తినగలిగినంత భోజనం ఒకరే రాక్షసుల్లా తింటున్నారు. ఇదంతా.. ఎక్కువ మంది తమ వీడియోలు చూడాలని ఆత్రుతతో చేస్తున్నారు. పక్క వాళ్లు తమ గురించి ఏమనుకుంటారో వీరికి అవసరం లేదు.
ఈ పిచ్చి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోవలో ఒక అమ్మాయి నడి రోడ్డుపై కేవలం శరీరానికి ఒక టవల్ చుట్టుకొని తిరిగింది. ఆమెను రోడ్డుపై పోయే వారందరూ చూస్తుండగా తన టవల్ ను తీసేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా కళ్లప్పగించి చూస్తుండి పోయారు. ఇదంతా ఆమె వీడియో షూట్ చేసి తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్
ఆ అమ్మాయి మరెవరో కాదు.. మింత్రా ఫ్యాషన్ సూపర్ స్టార్ పోటీల విన్నర్ తనుమిత. ఆమెకు ఇన్స్ టాగ్రామ్‌లో 37000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: Job Harassment| ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్
తాజాగా తనుమిత ఒక వింత ప్రయోగం చేసింది. ముంబై నగరంలోని బిజీగా ఉండే రోడ్లపై పింక్ కలర్ టవల్ కట్టుకొని తిరుగుతూ వీడియా తీసింది. ఈ వీడియోలో కాసేపు జనం మధ్యలో ఇటు అటు నడుస్తుండగా.. మరి కాసేపు బస్ స్టాప్ వద్ద కూర్చొని ఫోన్ లో మాట్లాడుతూ కనిపించింది. వీడియో చివర్లో తాను ధరించిన టవల్ అందరి ముందూ తీసేసింది. ఆమె చుట్టూ ఉన్న వారంతా తనుమితనే చూస్తుండి పోయారు. అయితే టవల్ లోపల మధుమిత ఓ పొట్టి ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని ఉంది. టవల్ తీసేసిన తరువాత తన జుట్టును స్టైల్ గా విరజిమ్మి.. పక్కనున్న వ్యక్తి కోట్ ని ధరించి.. పోజులిచ్చింది. ఈ వీడియో ద్వారా తనుమిత తన డ్రెస్సింగ్ స్టైల్ ను ప్రొమోట్ చేసింది.
వీడియో చూడడానికి క్లిక్ చేయండి
తనుమిత వీడియోకు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి.
Also Read: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్