BigTV English

Naveen Polishetty: బ్రేకింగ్: హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్.. చేతికి తీవ్ర గాయాలు..

Naveen Polishetty: బ్రేకింగ్: హీరో నవీన్ పొలిశెట్టికి  యాక్సిడెంట్.. చేతికి తీవ్ర గాయాలు..
naveen polishetty latest news
Naveen Polishetty

Naveen polishetty accident news(Tollywood news in telugu): యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్‌కి ప్రమాదం జరగడంతో తీవ్రగాయాలయినట్లు సమాచారం. అమెరికాలో బైక్ మీద నుంచి జారి పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ ప్రమాదంలో అతడి చేతికి తీవ్ర గాయలయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు టాక్. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన నవీన్‌కి దాదాపు రెండు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యుల తెలిపినట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఎలాంటి అప్డేట్ రాలేదు.

చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయని అంటున్నారు. అయితే చిన్న చిన్న దెబ్బలే తగిలితే రెండు నెలల రెస్ట్ ఎందుకని కొందరు అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా అతడికి బలంగానే గాయాలు అయి ఉండవచ్చు అని అంటున్నారు.


Also Read: మైత్రీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. ఎక్కడ, ఎప్పుడంటే?

ఇక నవీన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నవీన్‌ పొలిశెట్టి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి కథ కూడా రెడీగా ఉంది. కానీ దర్శకుడి కోసం వేట కొనసాగిస్తున్నారు.

జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అతడు నటించబోయే తదుపరి సినిమాలపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అతడికి ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×