E-Paper
Advertisement

Regina Marriage: పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్ రెజీనా.. వరుడు ఎవరంటే..?

Regina Marriage: పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్ రెజీనా.. వరుడు ఎవరంటే..?
Advertisement

Regina Marrying a Business Man: చెన్నైలో పుట్టి పెరిగిన నటి రెజీనా.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్‌ వంటి భాషల్లో కూడా ఈ బ్యూటీ నటించి మంచి హిట్లు అందుకుంది. మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది.

Advertisement

టాలీవుడ్‌లో పిల్లా నువ్వు లేని జీవితం, కొత్త జంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో ఈ అమ్మడు యూత్‌కి బాగా దగ్గర అయింది. అయితే ఒక్క హీరోయిన్‌గానే కాకుండా నెగెటివ్ పాత్రలో కూడా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రెజీనా.. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో ఈ అమ్మడు వెబ్‌ సీరీస్‌‌లపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస పెట్టి వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది.

Advertisement

ఇక అటు సినిమాలు, ఇటు వెబ్‌సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చకున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ యంగ్‌ హీరో సందీప్ కిషన్‌తో.. రెజినా రిలేషన్‌లో ఉన్నారంటూ గతంలో జోరుగా వార్తలు సాగాయి.

READ MORE: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌ రెడీ.. ఎప్పుడో చెప్పేసిన దర్శకుడు ప్రశాంత్

అయితే అందులో ఎలాంటి వాస్తవమూ లేదని హీరో సందీప్ చెప్పాడు. తాను రెజీనా కేవలం స్నేహితులం మాత్రమేనని.. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. దీంతో అప్పట్నుంచి ఆ వార్తలకు చెక్ పడింది. ఆ తర్వాత మెగా హీరో సాయి తేజను రెజీనా ఏకంగా పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ జోరుగా సాగాయి. అవి కూడా కొద్ది రోజులకి ఆగిపోయాయి.

కాగా కొన్నిరోజుల తర్వాత రెజీనా ఓ తమిళ స్టార్‌ హీరోతో సీక్రెట్‌గా రిలేషన్ మెయింటైన్ చేస్తుందని టాక్‌ వినిపించింది. అయితే ఆ వార్తలు కూడా ఫేకే అని తేలిపోయింది. వీటిపై రెజీనా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటివన్నీ కామన్ అని లైట్ తీసుకుంది.

తాజాగా ఆమెకు సంబంధించి మరొక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకోవాలని రెజీనా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు కోలీవుడ్‌ ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను రెజీనా పెళ్లి చేసుకోబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇరు కుటుంబాల మధ్య కూడా మాటలు జరిగినట్లు తెలుస్తోంది.

READ MORE: 14 ఏళ్లుగా ప్రేమాయణం.. ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్

త్వరలో ఈ శుభవార్తను రెజీనా తమ అభిమానులతో పంచుకునే అవకాశముందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో కూడా ఎంత వరకు నిజం ఉందో తెలీదు. కానీ ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్‌లో అజిత్ హీరోగా నటిస్తోన్న ‘విడాముయార్చి’ మూవీలో నటిస్తోంది. ఇందులో విలన్‌కి జోడీగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×