BigTV English
Advertisement

Varalaxmi Sarathkumar got Engaged: 14 ఏళ్లుగా ప్రేమాయణం.. ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi Sarathkumar got Engaged: 14 ఏళ్లుగా ప్రేమాయణం.. ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్


Varalaxmi Sarathkumar Engaged: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్‌కి నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినిమాలలో ఎలాంటి క్యారెక్టర్‌ని అయినా చాలా సింపుల్‌గా చేసేస్తుంది ఈ అమ్మడు. ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో అదరగొట్టేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్‌లో భారీ డిమాండ్. రవితేజ మూవీ క్రాక్, బాలయ్యబాబు వీరసింహా రెడ్డి వంటి మూవీలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీల్లో నెగెటివ్ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే సమంత యశోద మూవీలో కూడా విలన్ రోల్‌లో నటించిన ఈ బ్యూటీ ఆ మూవీలో తన అందం, నటనతో మంచి మార్కులు కొట్టేసింది.


ఇక ఇటీవలే కోట బొమ్మాళి పిఎస్ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించి యాక్టింగ్‌తో దుమ్ము దులిపేసింది. అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీలో కూడా అద్భుతమైన పాత్ర చేసి ఆడియన్స్‌ని అలరించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ వంటి భాషల్లో కూడా ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్ల వస్తున్నాయి.

READ MORE:  కల్కి 2898 AD క్రేజీ అప్డేట్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

ఈ తరుణంలో ఈ అమ్మడు తాజాగా తమ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా తన ప్రియుడు నిక్లాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.

సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే.. తన పర్సనల్ లైఫ్‌లో కూడా ఈ బ్యూటీ హ్యాపీగా ఉంటుంది. ఇక ఎప్పటినుంచో వరలక్ష్మీ సింగిల్‌గానే ఉంటుంది. ఈ మధ్య ఆమెకు సంబంధించిన పలు గాసిప్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆమె పెళ్లి గురించి చాలానే వార్తలు జోరుగా సాగాయి.

ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి బయట కనిపించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టేవి. అయితే ఇవి బాగా వైరల్ కావడంతో.. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ భామ వేరొక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టయింది.

తాజాగా నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కాగా వీరిద్దరి నిశ్ఛితార్థం మార్చి 1న జరిగినట్లు సమాచారం. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ జంటకు సినీ సెలబ్రెటీలు, అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

READ MORE: రామ్ చరణ్‌కు భార్యపై ఎంత ప్రేమో.. బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాల్సిందే భయ్యా..

ఇకపోతే వరలక్ష్మీ శరత్ కుమార్ – నిక్లాయ్ సచ్‌దేవ్ దాదాపు 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటవుతున్నారు. త్వరలో వీరి వివాహం జరగనుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×