BigTV English

Jai Hanuman: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌ రెడీ.. ఎప్పుడో చెప్పేసిన దర్శకుడు ప్రశాంత్

Jai Hanuman: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌ రెడీ.. ఎప్పుడో చెప్పేసిన దర్శకుడు ప్రశాంత్


Jai Hanuman Prasanth Varma : దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇక అదే సమయంలో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా.. వాటన్నింటిని వెనక్కి నెట్టి అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. సంక్రాంతి విన్నర్‌గా ఈ మూవీ నిలిచింది.


ఇక థియేటర్లలో రన్ అవుతూనే భారీ రికార్డులను క్రియేట్ చేసింది. బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అందరినీ అబ్బురపరచి.. నిర్మాతలకు లాభాల పంట పండించింది. తెలుగులోనే కాకుండా నార్త్‌లోనూ భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోయింది.

READ MORE: ఓటీటీలోకి ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

ఇక హిందీలో దాదాపు రూ.50 కోట్లు రాబట్టి అతి తక్కువ తెలుగు సినిమాల జాబితాలో హనుమాన్ మూవీ చేరిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ యూనిట్ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్ మూవీ రాబోతుందని అన్నాడు. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అంతా ఇప్పటికే కంప్లీట్ అయిందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగిస్తున్నామని అన్నాడు.

అంతేకాకుండా హనుమాన్ మూవీలో చివరి ఐదు నిమిషాలు ఆడియన్స్‌ను ఎంతలా అలరించిందో సీక్వెల్ మూవీ జైహనుమాన్ మూవీలో కూడా రెండున్నర గంటలు అంతే ఆసక్తిగా ఉంటుందని చెప్తూ సినిమాపై అప్పుడే హైప్ పెంచేశాడు.

ఇక హనుమాన్ మూవీని ఇంతలా ఆదరించిన ప్రేక్షకాభిమానులకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని.. జై హనుమాన్ మూవీని మరింత బాగా తీసి మీ అందరినీ అలరిస్తానని చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తే ఈ మూవీ ఫస్ట్ లుక్ మరో నెల లేదా రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జై హనుమాన్ మూవీలో రాముడు, హనుమంతుడి పాత్రకోసం టాలీవుడ్ స్టార్ హీరోలను ఎంపిక చేసే అవకాశమున్నట్లు ఇటీవల దర్శకుడు ప్రశాంత్ తెలిపాడు.

READ MORE: 14 ఏళ్లుగా ప్రేమాయణం.. ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్

అందులో రాముడిగా మహేశ్ బాబును, హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవిని తన మనసులో ఉందని తెలిపాడు. చూడాలి మరి ఇందులో నటించేందుకు ఈ స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక ఇంకెవరినైనా దర్శకుడు తీసుకుంటాడా అని. ఇకపోతే ఈ మూవీ థియేటర్ రన్ అనంతరం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా మార్చి 8న జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×