BigTV English

Nayanthara-Vignesh: నయన్ ‘అన్‌ఫాలో’ చేశాక విఘ్నేష్ మొదటి పోస్ట్‌.. ఆమె ఏం చేస్తుందో చూడండి!

Nayanthara-Vignesh: నయన్ ‘అన్‌ఫాలో’ చేశాక విఘ్నేష్ మొదటి పోస్ట్‌.. ఆమె ఏం చేస్తుందో చూడండి!


Vignesh Shivan Shares First Post After Nayanthara ‘Unfollows’ Him on Instagram: విగ్నేష్ శివన్‌ను నయనతార ‘అన్‌ఫాలో’ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్‌ను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నయనతారకు సంబంధించిన ఒక పోస్ట్‌ను పెట్టాడు.

ఎప్పటిలాగే, నయనతార కోసం విఘ్నేష్ ఉత్సాహంగా కనిపించాడు. అతను నయనతారకు సంబంధించిన ఓ బ్యూటీ బ్రాండ్, 9 స్కిన్, రాబోయే అవార్డుల కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుందని వెల్లడించిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అవార్డుల కార్యక్రమం గురించిన వివరాలతో పాటు నయనతార పూలతో పోజులిచ్చిన ఫోటోను పోస్ట్ చేశాడు.


విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌తో తనకి నయనతారకు మధ్య ఏదో తప్పు జరిగిందనే పుకార్లకు ముగింపు పలికాడు. కాగా.. నయనతార కూడా విఘ్నేష్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ ఫాలో చేసినట్లు కనిపించింది. నయనతార విఘ్నేష్‌ను ‘అన్‌ఫాలో’ చేసిందని అభిమానులు గమనించిన కొన్ని గంటల్లోనే ఇది జరిగింది.

నయనతార తన భర్తను అన్‌ఫాలో చేయకముందు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తన బాధని వ్యక్తపరిచేలా ఇంగ్లీష్ పదాలతో ఓ కొటేషన్‌ను పోస్ట్ చేసింది. దీంతో పాటు తన భర్తను కూడా అన్‌ఫాలో చేసింది. దీంతో ఆమెకి విఘ్నేష్ మధ్య అంతా బాగానే ఉందా? వీరిద్దరు విడాకులు తీసుకుంటారా? అనే ప్రశ్నలు నెట్టింటా వైరల్‌గా మారాయి. కానీ విఘ్నేష్ ఒక్క స్టోరీ, నయనతార మళ్లీ తన భర్తను ఫాలో చేయడంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడ్డాయి.

Read More: భర్తని అన్‌ఫాలో చేయడంపై నయనతార ఫ్యాన్స్ కంగారు, రీజన్ అదేనా అంటూ..

2023 ఆగస్టులో నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో చేరింది. ఆమె అరంగేట్రం చేసినప్పటి నుండి, ఆమె తన కవలల ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వచ్చింది.

నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9, 2022న వివాహం చేసుకున్నారు. చెన్నై వెలుపల మహాబలిపురంలో వారి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతితో సహా పలువురు స్టార్స్ వారి పెళ్లికి హాజరయ్యారు. ఈ జంట అక్టోబర్ 2022లో సరోగసీ ద్వారా తమ కుమారులు ఉయిర్, ఉలగంలను స్వాగతించారు.

నయనతార గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

Tags

Related News

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Big Stories

×