BigTV English

Tollywood Actress: కూతురి కోసం కెరీర్ ను దూరం చేసుకున్న.. టాలీవుడ్ హీరోయిన్..!

Tollywood Actress: కూతురి కోసం కెరీర్ ను దూరం చేసుకున్న.. టాలీవుడ్ హీరోయిన్..!

Tollywood Actress Shobana who left her Career for her Daughter: ఎలాంటి భావోద్వేగాన్నైన చిటికెలో వ్యక్తీకరించే సుందరి, సుమధుర కావ్యాలు ఆమె కళ్లు. అందం, అభినయం నాట్యో మేటి కలయిక శోభన. సినిమాల్లో నటించిన ఎక్కడ హుందాతనాన్ని కోల్పేలేదు. సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన, మోడ్రన్ డ్రెస్స్ లో మాయ చేసిన తను తనలాగే ఉంది తప్ప ఎక్కడ అతి కనిపించనీయలేదు. అందుకే కాబోలు శోభనని వినయశీలి అని ఆమె ఆత్మీయులు తెగ మెచ్చుకుంటారు.


ఇటు సినిమాలకు గ్లామర్ అద్దింది. క్లిస్టమైన సన్నివేశాల్లో అభినయాన్ని జోడించింది. అటు నాట్య కళాకారిణిగా శోభ తెచ్చింది. ఎంతో ఇష్టపడి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం ఆమెకు. తన నటనతో దశాబ్ధం పాటు తెలుగు వారిని అలరించిన శోభన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. 1970 లో మార్చి 21న జన్మించింది. దక్షణాదిలోని అన్ని భాషల్లో నటించింది. 1980- 1990 మధ్యలో మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన భాషల్లో నటించిన శోభన..


మరో ప్రఖ్యాత నటి రేవతి దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ మూవీలో నటించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. 2022 లో విడుదలైన మిత్ర మై ఫ్రెండ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 49వ జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ ఇంగ్లీష్ చిత్రంగా పురష్కారాన్ని అందుకుంది. అంతే కాదు ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అమర్ ప్రేమ చిత్రంలో బాల నటిగా అరంగేట్రం చేసింది. 1984 లో రూపొందిన చిత్రం ఏప్రిల్ 14 మలయాళ చిత్రంలో పక్కంటి అమ్మాయిగా ఈ సినిమాలో అలరించింది. ఆ తరువాత వరుసగా చిత్రాల్లో నటించింది.

Also Read: మురారి మూవీ చూస్తూ పెళ్లిచేసుకున్నారు.. ఇదెక్కడి అభిమానమో?

అనతి కాలంలోనే ఆమె తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసి మంచి గుర్తింపు పొందింది. అప్పటి అగ్ర శ్రేణి కథానాయికలతో నటించిన శోభన ఎందరో దిగ్గజ దర్శకుల దగ్గర పని చేసింది. శోభన దాదాపు 230 కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా అగ్ర కథానాయుకుల సరసన ఆమె నటించింది. 1982లో విక్రమ్ , విజృంభణ, అజేయుడు, త్రిమూర్తులు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడుగారు,
కోకిల, టైగర్ శివ, నారీ నారీ నడుమ మురారి, అల్లుడు దిద్దిన కాపురం, ఏప్రిల్ 1 విడుదల, కీచురాళ్లు, రౌడీ అల్లుడు, రౌడీగారి పెళ్ళాం, అప్పుల అప్పారావు, అహంకారి, హలో డార్లింగ్, అసాధ్యులు, రక్షణ, నిప్పురవ్వ, సూర్యపుత్రులు ఇలా పలు సినిమాల్లో నటుంచింది. కళా రంగానికి శోభన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2014 లో పద్మ శ్రీ పురుష్కారాన్ని సత్కరించింది. ఎన్నో విజయ వంతమైన చిత్రాల్లో నటించిన శోభన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు ఎన్నో అవార్డులు, రివార్డులు, పురష్కారాలు, సత్కారాలతో గౌరవించాయి.

అయితే శోభన ఒక టైమ్ లో తన డ్రీమ్ కోసం, తన కుమార్తె కోసం సినిమాలకు దూరంగా ఉందన్న విషయం మీకు తెలుసా..? అవును.. కాకపోతే తన దత్త పుత్రిక కోసం. 54 ఏళ్ల వయసున్న శోభన ఇంతవరకు వివాహం చేసుకోలేదు. 2011 లో ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది ఈ భామ. అప్పుడప్పడు ఒకటి రెండు సినిమాల్లో నటించింది.

 

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×