AS Ravi Kumar Chowdhary : ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. యజ్ఞం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రవికుమార్ చౌదరి. బాలకృష్ణ హీరోగా వీరభద్ర సినిమాను చేశాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా రవికుమార్ చౌదరికి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ సినిమా సాయి తేజ్ కెరీర్ కి మంచి ప్లస్ గా మారింది. ఏదైనా మాటను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అలవాటు ఉన్న దర్శకుడు.
గత రాత్రి రవి కుమార్ చౌదరి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ లో దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి చెందారనే వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. కార్డియో కరెస్ట్ తో రవికుమార్ చౌదరి మృతి చెందినట్లుగా సమాచారం. రవికుమార్ చౌదరి మరణం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్న రవికుమార్ చౌదరి ని రీసెంట్ గా రాజ్ తరుణ్ తో చేసిన తిరగబడరా సామీ కూడా డిజప్పాయింట్ చేయడంతో మానసిక ఒత్తిడికి గురయ్యారని సన్నిహితుల సమాచారం.