White Hair Problem: ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోను వచ్చేస్తుంది. తెల్లజుట్టు చిన్న వయసులో రావడం వల్ల చాలా కంగారు పడిపోయి.. మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైలు వాడేస్తూ ఉంటారు. అవి కెమికల్స్ తయారు చేసి ఉంటాయి కాబట్టి.. జుట్టు రాలే సమస్యలు ఎక్కువయ్యో ఛాన్స్ ఉంది. అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా.. తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. సహజ సిద్ధంగా తగ్గించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం కేవలం మూడు పదార్ధాలతో చక్కగా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
టీపొడి
కాఫీ పొడి
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో రెండు టీ స్పూన్ల టీపొడి తీసుకుని.. 10 నిమిషాల పాటు వేగించి.. ఆ తర్వాత మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్‌ను చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో టీస్పూన్ కాఫీ పొడి, కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా ప్రతి వారం చేస్తే.. శాశ్వతంగా జుట్టు నల్లబడుతుంది.
ఉపయోగాలు
టీపొడి జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేసి.. జుట్టు రాలకుండా అరికడుతుంది. దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో చక్కగా పనిచేస్తుంది. టీ పొడి అన్ని సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. తెల్లజుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఇక కాఫీ పౌడర్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. చర్మ సౌందర్యానికి ఎంత మంచిదో.. తెల్లజుట్టు నివారణకు కూడా అంతే ఉపయోగపడుతుంది. కాఫీ పొడిలో సహజ సిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టు పోలికల్స్‌లోని పిగ్మెంట్ కణాలను కాపాడటానికి, జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
జుట్టు నల్లగా మారేందుకు ఈ టిప్స్ కూడా పాటించండి. అద్భుతంగా పనిచేస్తాయి.
కావాల్సిన పదార్దాలు
మెంతులు
కరివేపాకు
టీపొడి
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో రెండు టీ స్పూన్లు మెంతులు, గుప్పెడు కరివేపాకు, రెండు టీ స్పూన్లు టీపొడి వేసి బాగా నల్లగా మారేంతవరకు వేయించాలి. వీటిని మిక్సీజార్ లోకి తీసుకుని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పౌడర్‌ను గిన్నెలోకి తీసుకుని.. అందులో కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టుకుని.. గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు అనేది నల్లబడుతుంది. అంతేకాదు జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
Also Read: ఈ హెయిర్ ఆయిల్‌తో.. తల మోయలేనంత జుట్టు మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.