Actress..తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఒకటి రెండు సినిమాలతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇక మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి. అలా దూరమైన వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఒక ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ తల్లి అయ్యాను అంటూ అభిమానులతో చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ ఇషితా దత్తా (Ishita Dutta)..
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇషిత..
టాలీవుడ్ లో ప్రముఖ యంగ్ హీరో తనీష్ (Tanish) నటించిన ‘చాణుక్యుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అయితే హిందీలో మాత్రం పలు సినిమాలలో కనిపించింది.ఇక సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే 2016లో రిష్టన్ గా సౌధాగర్ – బాజిగర్ అనే సీరియల్ లో నటించేటప్పుడు తోటి నటుడు వత్సల్ సేథ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇరు కుటుంబాల సమక్షంలో 2017 లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి 2023లో పండంటి బాబు జన్మించగా.. ఇప్పుడు మరొకసారి ఇషిత తల్లి అయింది. తమకు మహాలక్ష్మి పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ జంట తెలియజేసింది.
ఇద్దరి నుంచి నలుగురిగా మారాము – ఇషితా దత్త
“మేము ఇప్పుడు ఇద్దరి నుంచి నలుగురు గా మారిపోయాము. మా ఫ్యామిలీ ఇప్పుడు సంపూర్ణమైంది. నాకు కూతురు పుట్టింది” అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది. ఇక మరొకవైపు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వత్సల్ సేథ్ మాట్లాడుతూ..” తల్లిదండ్రులుగా మేము మా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయించాను. నేను.. నా కొడుకు, నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆ ఇద్దరి పట్ల నా నుంచి ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం” అంటూ ఆయన తెలిపారు. ఇంకా వత్సల్ సేతు విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut)దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘ఆది పురుష్’ సినిమాలో కీలకపాత్ర పోషించారు.
ఇషిత సినిమాలు..
తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. ‘దృశ్యం’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఇషిత. అజయ్ దేవగన్, శ్రీయ కలసి ఈ సినిమాలో నటించారు. ఇందులో టబు కూడా కీలక పాత్ర పోషించింది. ఇక దృశ్యం 3లో కూడా ఇషితా నటించనున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇప్పుడు పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ జంట.
ALSO READ:Alekhya Chitti Pickles : పికిల్స్ అక్కకు రోగం ఏ మాత్రం తగ్గలేదు భయ్యా.. కొత్త వీడియోలో అవే బూ***