E-Paper
Advertisement

varun tej – Matka: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిపోయిన సినిమా..?

varun tej – Matka: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిపోయిన సినిమా..?
Advertisement

varun tej: మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు. వరుణ్ మునిపటి సినిమాలు గని, గాండీవధారి అర్జున సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన ‘గాండీవధారి’ అర్జున మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది.

దీంతో ఇకపై తాను తీయబోయే సినిమాలపై వరుణ్ తేజ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన వద్దకు వస్తున్న సినిమాలలో డిఫరెంట్‌గా ఉన్న స్టోరీలను మాత్రమే ఓకే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే అలాంటి డిఫరెంట్ కథతోనే అతడు ఇప్పుడు ఓ మూవీ చేస్తున్నాడు. డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ మూవీ చేస్తున్నాడు. వరుణ్ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది.

READ MORE: వరుణ్ కి జట్కా ఇచ్చిన మట్కా.. మెగా కోడలు వైరల్..

Advertisement

ఇక వరుణ్ ఆశలన్నీ ఈ మూవీ పైనే ఉన్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. చాలాకాలం క్రితమే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చి వైరల్‌ అవుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా కాస్త బ్రేక్ పడినట్లు సమాచారం.

ఈ సినిమాకు బడ్జెట్ చేతులు మారే అవకాశాలు ఉండటంతో ప్రస్తుతం హోల్డ్‌ పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి కథలతో తెరకెక్కిన చిత్రాలకు ప్రస్తుతం మార్కెట్ బాగాలేదని.. అందువల్ల ఈ సినిమాను కొంతకాలం పక్కన పెట్టాని మూవీ యూనిట్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

READ MORE: పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..!

అంతేకాకుండా చాలా కాలంగా వరుణ్‌తేజ్ హిట్ లేకోవడంతో.. ఆయన మార్కెట్ కూడా పెద్దగా లేదు. దీంతో ఈ మూవీ డీల్స్, రికవరీలు పరిగణలోకి తీసుకుంటే నష్టాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి బడ్జెట్‌ను తగ్గించే పనిటో పడ్డారట.

అంతేకాకుండా ఈ సినిమాకు గానూ వరుణ్ తేజ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ను కూడా కాస్త తగ్గించుకోమని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం జరగాల్సిన షెడ్యూల్స్‌కి కాస్త బ్రేక్ పడినట్లు సమాచారం.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×