BigTV English

Varun Tej Matka Movie : వరుణ్ కి జట్కా ఇచ్చిన మట్కా.. మెగా కోడలు వైరల్..

Varun Tej Matka Movie : వరుణ్ కి జట్కా ఇచ్చిన మట్కా..  మెగా కోడలు వైరల్..
Meenakshi Chaudhary

Varun Tej Matka Movie : సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఒక సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. హీరో దగ్గర నుంచి నిర్మాత వరకు ఏదో ఒక సెంటిమెంట్ లింక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వరుణ్ విషయంలో జరిగిన ఒక విషయానికి కొత్త పెళ్లికూతురు లావణ్య త్రిపాఠిను కూడా ఇదే రకంగా అభిమానులు లింక్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్న మెగా ప్రిన్స్, లావణ్య త్రిపాఠి ఇటీవల పెళ్లితో ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా వరుణ్ సినిమాకి సంబంధించి జరిగిన ఒక ఇష్యూ కి లావణ్య పాదమహిమే కారణమని ఫాన్స్ వాపోతున్నారు.


పెళ్లయిన తర్వాత నిహారిక ..ఆమె భర్త చైతన్యకు మధ్య సంధి కుదిరేలా ఉంది అన్న వార్త వచ్చినప్పుడు.. కొత్త కోడలు కాలు పెట్టిందో లేదో కలిసి వచ్చేసింది అన్నారు. మరి ఇప్పుడు అలా అన్న వాళ్ళే లావణ్యను విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. గత రెండు సంవత్సరాలుగా వరుణ్ తేజ్ కెరియర్లో భారీ సక్సెస్ నమోదు కాలేదు. రీసెంట్గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య వచ్చిన గాంఢీవదారి అర్జున మూవీ అతని కెరియర్ లోనే మోస్ట్ డిజాస్టర్ మూవీగా మిగిలింది. ఈ క్రమంలో వరుణ్ ఆశలు మొత్తం నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియన్ మూవీపై పెట్టుకున్నాడు.

మార్కెట్లో అసలు ఈ మూవీ విడుదల అయిందా లేదా అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. వరుణ్ నెక్స్ట్ చేయబోయే మూవీకి డైరక్టర్ గా పలాస ఫేమ్ కరుణ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ఇప్పటికే మట్కా అనే క్రేజీ టైటిల్ ని కూడా ప్రకటించారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరుణ్ పక్కన హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా .. మరో కీలకమైన పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి నటిస్తోంది. ఇది వరుణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియన్ మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.


ఇక మూవీ 1960 కాలం.. విశాఖపట్నంలో జరిగిన కొన్ని సన్నివేశాల నేపథ్యంలో సాగుతుంది అని టాక్. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరొక చిన్న క్లాసిక్ మెగా ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. వరుణ్ తేజ్ షాక్ తగిలేలా ఈ మూవీ విషయంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డారట. ప్రస్తుతం వరుణ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాపై అంత బడ్జెట్ పెట్టడం అవసరమా అనే డైలమాలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మట్కా మూవీ స్టార్ట్ కాకముందే వరుణ్ కి జట్కా తగిలింది. దీంతో పాపం లావణ్య అడుగుపెట్టిన వేల విశేషమే ఇదంతా.. అలా అడుగు పెట్టిందో లేదో ఇలా వరుణ్ కి దెబ్బ పడిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×