BigTV English

IND Vs ENG 3rd Test: మూడో టెస్టు.. ఆ నలుగురు రికార్డులు బ్రేక్ చేస్తారా?

IND Vs ENG 3rd Test: మూడో టెస్టు.. ఆ నలుగురు రికార్డులు బ్రేక్ చేస్తారా?

Will These Cricketers Break The Record In Rajkot?: భారత్- ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్‌లో జరగనున్న మూడో టెస్టులో నలుగురు క్రికెటర్లు రికార్డుల ముంగిట రెడీగా ఉన్నారు. వారిలో ముందుగా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ఎందుకంటే తనిప్పటికి 499 వికెట్లు తీసుకుని, 500 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. అంతేకాదు అనిల్ కుంబ్లే సాధించిన మరో రెండు రికార్డులను కూడా బ్రేక్ చేసేలాగే కనిపిస్తున్నాడు.


భారతగడ్డపై అనిల్ కుంబ్లే 63 మ్యాచ్‌లు ఆడి 350 వికెట్లు తీశాడు. ఇప్పుడు అశ్విన్ 57 మ్యాచ్‌లు ఆడి  346 వికెట్లు సాధించాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి మరో 5 వికెట్ల దూరంలో ఉన్నాడు.

Read More: నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్..రాజ్ కోట్ కింగ్ ఎవరు?


కుంబ్లే తన కెరీర్‌లో 35 సార్లు 5 వికెట్లు తీశాడు. ఇప్పుడు అశ్విన్ 34 సార్లు 5 వికెట్లు తీసి తన వెనుకే ఉన్నాడు. అందరూ అనేదేమిటంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే అన్ని రికార్డులు ఒకేసారి అశ్విన్ ఖాతాలో పడిపోతాయని అంటున్నారు.

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మూడో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లో 5-5 వికెట్లు తీస్తే మైసూర్ ఎక్స్ ప్రెస్ జవగల్ శ్రీనాథ్ రికార్డ్‌ని దాటేస్తాడు. ఫాస్ట్ బౌలర్లలో శ్రీనాథ్ 13 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఇప్పుడు బుమ్రా 12 సార్లు మాత్రమే 5 వికెట్లు తీసి తన వెనుకే ఉన్నాడు.  

ఇంగ్లాండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 695 వికెట్లు తీసి 700 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు మరో 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. తను 183 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 343 ఇన్నింగ్స్‌లలో 695 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాజ్ కోట్ మ్యాచ్ ద్వారా తను కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడనున్నాడు. ప్రతీ క్రికెటర్ కి ఇదొక కల అని చెప్పాలి. ఎందుకంటే ఒక దేశం తరఫున 100 టెస్ట్ లు ఆడటం, అంత సుదీర్ఘమైన కెరీర్ ని కొనసాగించడం ఎందరికోగానీ సాధ్యంకాదు. అది ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సాధించాడు. అంతేకాదు మరో 3 వికెట్లు తీస్తే, 200 వికెట్ల క్లబ్ లో చేరతాడు. 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×