OTT Movie : ఈ కంప్యూటర్ యుగంలో అబ్బురపరిచే టెక్నాలజీకి కొదవలేదు. రోజుకొక కొత్త టెక్నాలజీతో రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వీటిలో రోబోలు చాలా కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఇంట్లో పనులను చక్కబట్టే విధంగా వీటిని తయారు చేస్తున్నారు. యుద్ధాలకు సైతం వీటిని వాడటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక జంట, ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకుంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహకు అందని విధంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘లైఫ్ లైక్’ (Life like). 2019 లో వచ్చిన ఈ సైన్స్-ఫిక్షన్ డ్రామా మూవీకి జోష్ జానోవిచ్ దర్శకత్వం వహించాడు. గ్రైండ్‌స్టోన్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ పంపిణీ చేయగా, లయన్స్‌గేట్ ఫిల్మ్స్ దీనిని నిర్మించింది. ఇందులో ఇంటిని చూసుకోవడానికి హెన్రీ అనే రోబోట్‌ను ఒక జంట కొనుగోలు చేస్తుంది. ఆతరువాత ఆ యువ జంటపై డానికి ఫీలింగ్స్ వస్తాయి. ఈ మూవీలో స్టీవెన్ స్ట్రెయిట్, అడిసన్ టిమ్లిన్, జేమ్స్ డి ఆర్సీ, డ్రూ వాన్ అకర్ నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జిమ్మీ, సోఫీ అనే భార్య భర్తలు సంతోషంగా జీవిస్తుంటారు. కొద్ది రోజుల్లో జిమ్మీకి కంపెనీ సీఈఓ పదవి కూడా వస్తుంది. ఆ తర్వాత నుంచి జిమ్మీ బాగా బిజీ అయిపోతాడు. ఇంట్లో సోఫీ ఒంటరిగా ఉంటుంది. పని వాళ్ళ ప్రవర్తన నచ్చక, వాళ్లని సోఫీ ఉద్యోగం నుంచి తీసేస్తుంది. ఆ తర్వాత ఆమెకు తోడు కోసం హెన్రీ అనే ఒక రోబోను తెప్పిస్తాడు జిమ్మీ. జిమ్మీ బాగా బిజీగా ఉండటంతో, రోబో కి బాగా అలవాటు పడిపోతుంది సోఫి. తనతో ఆట, పాటలతో సరదాగా గడుపుతుంది. అయితే ఉన్నట్టుండి దానికి సోఫీ పై ఫీలింగ్స్ వస్తాయి. సోఫీకి కూడా రోబో మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రోబో ముందరే బట్టలు మార్చుకుంటుంది. ఆ తర్వాత తన కోరికను రెచ్చగొట్టుకుంటుంది. రోబోతో నువ్వు ఇదంతా చూసావా అని అడుగుతుంది. నీకు ఇష్టమైతే ఇంకా చూస్తూనే ఉంటానని అంటుంది రోబో. ఆ తర్వాత సోఫీకి ఐ లవ్ యు కూడా చెప్తుంది. సోఫీ ఇది విని ఆశ్చర్యపోతుంది. ఒక రోబో ఐ లవ్ యు ఎలా చెప్తుందని అనుకుంటుంది. ఆ తర్వాత భర్తకు జరిగిన విషయం చెప్తుంది. నిజానికి జిమ్మీని కూడా రోబో సుఖపెడుతుంది. చివరికి రోబో వీళ్లిద్దరిని ఏం చేస్తుంది? రోబో కి ఫీలింగ్స్ ఎలా వస్తాయి? రోబోతో కోరికలను తీర్చుకుంటారా? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడండి.