BigTV English

Tollywood Heroine: ముగ్గురు హీరోల జీవితాలలో నిజమైన స్టార్ హీరోయిన్ సెంటిమెంట్.. క్రేజీ కదా..!

Tollywood Heroine:  ముగ్గురు హీరోల జీవితాలలో నిజమైన స్టార్ హీరోయిన్ సెంటిమెంట్.. క్రేజీ కదా..!

Tollywood Heroine.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్స్ గానే జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తమ అభిమాన హీరోకి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అంటూ చాలామంది హీరోల అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. అయితే అలాంటి బ్యాచిలర్ హీరోలకి ఒక గుడ్ న్యూస్ అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగినా.. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ హీరోయిన్ తో పెళ్లికాని హీరోలు నటిస్తే పెళ్లి జరుగుతుంది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


ఈ హీరోయిన్ తో నటిస్తే పెళ్లి ఖాయం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ (NTR ), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan)ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకున్నారు. అలా 2011లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోగా, అదే ఏడాది అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. మరుసటి ఏడాది రామ్ చరణ్ ఉపాసనని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకోవడానికి కారణం ఒకే ఒక్క హీరోయిన్. అయితే వీళ్లంతా పెళ్లిలు చేసుకోవడానికి కారణం నేనే అంటూ సదురు హీరోయిన్ ఆ విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia).


ముగ్గురు హీరోల జీవితాలలో నిజమైన తమన్నా సెంటిమెంట్..

టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీగా పేరు పొందిన తమన్నా.. ఏ హీరోతో నటిస్తే ఆ హీరోకి పెళ్లి జరుగుతుందనే ఒక సెంటిమెంటు తెరపైకి వచ్చింది.. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ – తమన్నా పాల్గొన్నప్పుడు స్వయంగా తమన్నా కామెంట్ చేసింది. చరణ్ నువ్వు ఒకటి ఇక్కడ గమనించావా..? నేను ఎవరితో నటిస్తుంటే ఆ హీరోలంతా కూడా పెళ్లి చేసుకుంటున్నారు.. అని తెలిపింది. దానికి రాంచరణ్ కూడా రియాక్ట్ అవుతూ అవును, రచ్చ సినిమా షూటింగ్ అప్పుడు నువ్వు నాకు ఇదే చెప్పావు. అయితే అప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే నాకు ఆశ్చర్యం అయింది. ముఖ్యంగా రచ్చ షూటింగ్ పూర్తయ్యే లోపే అమ్మానాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేయడం, ఉపాసనతో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి అని కూడా చకచకా జరిగిపోయాయి అంటూ తెలిపాడు రామ్ చరణ్.

యాదృచ్ఛికమైనా..షాకింగ్ ఘటన..

ఇకపోతే రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించినది. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ తో తమన్నా ఊసరవెల్లి చిత్రంలో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కూడా పెళ్లి చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా బద్రీనాథ్ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు.. ఇలా మొత్తానికైతే ఈ ముగ్గురు హీరోలతో జతకట్టడం ప్రారంభించిందో లేదో అప్పుడే వివాహాలు అయిపోయాయి. ఏది ఏమైనా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఇది యాదృచ్ఛికంగా జరిగినా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

తమన్నా సెంటిమెంట్ వర్కౌట్ కానీ హీరోలు వీరే..

ఇకపోతే తమన్నా కార్తితో ఆవార చిత్రంలో నటించినది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కార్తీ కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే , తమన్నా సెంటిమెంట్ అందరి హీరోలకి వర్కౌట్ కాలేదని చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్, రామ్ పోతినేని లాంటి హీరోలు తమన్నాతో నటించినప్పటికీ కూడా ఇప్పటికీ వారు బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు. మరోవైపు తమన్నా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×