BigTV English

Tollywood Rewind 2023 : ఈ ఏడాది ఒక్క బొమ్మ కూడా పడని స్టార్ హీరోలు వీరే !

Tollywood Rewind 2023 : ఈ ఏడాది ఒక్క బొమ్మ కూడా పడని స్టార్ హీరోలు వీరే !
Today tollywood news

Tollywood Rewind 2023(Today tollywood news):

టాలీవుడ్ లో 2023 సంవత్సరం ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే వాటిలో తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాలు కొన్ని అని చెప్పవచ్చు. బయట నుంచి వచ్చిన సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి. మరోపక్క టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా తమ సినిమాలతో బాగా సందడి చేసి కలెక్షన్స్ రాబట్టారు. అయితే కొందరు స్టార్ హీరోల  ఒక్క సినిమా కూడా  ఈ సంవత్సరం థియేటర్లో విడుదల కాలేదు.


ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హాలీవుడ్ హీరోల నుంచి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాకపోవడం సినీ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సంవత్సరం ఆగస్టులోనే గుంటూరు కారం సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్లో జరిగిన జాతీయ ..ఇతరత్రా కారణాల తో పాటు.. త్రివిక్రమ్ ,మహేష్ మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ పని రెండుసార్లు వాయిదా పడింది.. దీంతో ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి బరిలోకి దిగుతుంది.

ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. ఎన్టీఆర్ నుంచి కూడా ఈ సంవత్సరం ఎటువంటి సినిమా రాలేదు. ఆస్కార్ ప్రచారంలో పాల్గొనడానికి ఎక్కువ సమయం కేటాయించడంతో వీళ్ళకి షూటింగ్ చేయడానికి టైం మిగలలేదు. ఈ కారణం చేత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని బాగా లేట్ అయ్యాయి. షూటింగ్ దశలో ఉన్న ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 2024 లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోపక్క శంకర్ డైరెక్షన్లో చెర్రీ గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. అది ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియదు.


ఇక పుష్ప స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మొదట ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేయాలి అనుకున్నారు కానీ తర్వాత ఆ ప్రణాళికను విరమించుకున్నారు. సీక్వెల్ మరింత భారీగా ఉండాలి అనే ఉద్దేశంతో కొద్దిగా గ్రాండ్ గా ప్లాన్ చేయడంతో కాస్త షూటింగ్ లేట్ అయింది. ఇక ఈ చిత్రం 2024 ఆగస్టు కి విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఈ స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ నుంచి కూడా ఈ సంవత్సరం ఎటువంటి సినిమాలు రాలేదు. వెంకటేష్ కనీసం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో అయినా ప్రేక్షకులను పలకరించాడు. ఇక సంక్రాంతికి సైంధవ సినిమాతో మునిపెన్నడూ చూడనంత ఆక్షన్ మోడ్లో వచ్చేస్తున్నాడు వెంకి . ఇటు కింగ్ నాగార్జున వచ్చే సంక్రాంతికి నా సామి రంగ అంటూ వస్తున్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×