BigTV English

Vijay Deverakonda:విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!

Vijay Deverakonda:విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!

Vijay Deverakonda: “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని అంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయ‌న హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. అభిమానులు రౌడీ స్టార్ అని అభిమానంతో పిలుచుకునే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న 12 చిత్ర‌మిది. VD 12గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మూవీ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి ని తలపిస్తున్నారు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×