BigTV English

Sankranti Lakshmi: సంక్రాంతి లక్ష్మీ ఒంటరిగా రాదా……

Sankranti Lakshmi: సంక్రాంతి లక్ష్మీ ఒంటరిగా రాదా……

Sankranti Lakshmi:గజగజలాడించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో ముందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని రాజకుమారిలా వస్తుంది.. సంక్రాంతి కాంతి నిచ్చే పండుగ. పతంగుల పండుగ. ముగ్గుల పండుగ,. గొబ్బెమ్మల పండుగ, పాటల పండుగ. జానపదాల పండుగ. ఆనందాల పండుగ. ..హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి.


భోగి, మకర సంక్రాంతి, కనుము అనే మూడు రోజుల పెద్దపండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణ కథనం.

వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా సంక్రాంతి రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడు. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది.


సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు. సంక్రాంతినాడు పాలుపొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్లముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం.సంక్రాంతి పండుగలో అంతర్లీనంగా శాస్త్ర, సామాజిక అంశాలు ఎన్నెన్నో వున్నాయి.. నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం వంటి ధాన్యాలు-బీర, పొట్ల, చిక్కుడు, గుమ్మడి వంటి కూరగాయలతో ఆహార పదార్థాలను వండి తినడం ఆరోగ్యకరం.. .

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×