Tollywood.. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. స్టార్ హీరోల కొడుకులు, కూతుర్లు ఇప్పటికీ ఇదే రంగంలో స్థిరపడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే చాలా అరుదుగానే సెలబ్రిటీల వారసులు వ్యాపారాలలో కొనసాగడం మనం చూస్తూనే ఉంటాం. అందులోనూ టాలీవుడ్ నుంచి అయితే చాలామంది వారసులు ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటారు. అయితే ఇటువైపు ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది అత్యుత్సాహం చూపిస్తున్నా..అలా వచ్చిన వారంతా సక్సెస్ అవుతున్నారా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
వారసత్వంతో పనిలేదు..
అయితే వారసత్వం తో ఇండస్ట్రీలోకి వస్తే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. అటు అదృష్టం తో పాటు ఇటు నటనలో ప్రథమ కనిపరిచినప్పుడే ఇండస్ట్రీలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీలోకి వారసులుగా అడుగుపెట్టిన రామ్ చరణ్ అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలు వారసత్వంతోనే అడుగుపెట్టి నేడు గ్లోబల్ స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడవి శేష్ లాంటి హీరోలు కూడా సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ వారసత్వంతో పనిలేదు.. కానీ నటన, అదృష్టం ఉంటే కచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తారనటంలో సందేహం లేదు.
ఇండస్ట్రీలోకి మరో నటుడి వారసులు..
ఇక మరొకవైపు వారసత్వం నుండి వచ్చి సక్సెస్ కాలేక ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీ వారసులు కూడా ఉన్నారు. ఉదాహరణకు దివంగత నటుడు శ్రీహరి కుమారుడు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ సక్సెస్ అవ్వలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అంతకుముందు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మరో దివంగత నటుడు వేణుమాధవ్ కుమారులు ఇండస్ట్రీకి వస్తారా? అనే అంశం తెరపైకి వచ్చింది. వేణుమాధవ్ ఆయన భార్య శ్రీవాణి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి ప్రభాకర్ , చిన్నబ్బాయి సావికర్.. ఇద్దరూ కూడా తాజాగా తల్లితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . దీంతో ఇద్దరి ఫోటోలు వైరల్ కావడంతో.. ఇద్దరు మంచి హీరో కటౌట్లు ఇండస్ట్రీలోకి వస్తారా? రారా.? అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వీరిద్దరూ చదువుకుంటున్నట్లు సమాచారం.
వేణుమాధవ్ పై భార్య శ్రీవాణి కామెంట్స్..
ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుమాధవ్ భార్య శ్రీవాణి.. భర్త గురించి కొన్ని విషయాలు కూడా ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. మా పెళ్లయిన తర్వాత వేణుమాధవ్ ఇంకా బిజీ అయిపోయారు. అవుట్డోర్ షూటింగ్ ఉన్నప్పుడు మూడు వారాలకు ఒకసారి ఇంటికి వచ్చేవారు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారనే భావన మాకు కలుగుతోంది. అయితే షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన మాకు కాల్ చేసేవారు. పిల్లలను చాలా బాగా చూసుకునేవారు. ప్రస్తుతం మేము ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు. దీనికి కారణం ఆయన ముందు జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చింది శ్రీవాణి. మరి వేణుమాధవ్ కుమారులు చదువు పూర్తి చేసుకుని , ఇండస్ట్రీలోకి వస్తారా..? వస్తే నిలదొక్కుకుంటారా? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి.