Arjun Tendulkar Walks Off The Field(Sports news headlines): అర్జున్ టెండూల్కర్ ఎందుకు భయపడ్డాడు? ఛాన్స్ మిస్సవుతుందని గాయమంటూ డ్రామాలు ఆడాడా? నిజంగానే గాయమైందా? లక్నో ఆటగాడు పూరన్ దూకుడు చూసి మధ్యలోనే మైదానం ఎందుకు విడిచాడు? ఇలా రకరకాల ప్రశ్నలు క్రికెట్ లవర్స్‌ను వెంటాడుతున్నాయి.
అసలేం జరిగింది? 2024 ఐపీఎల్ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై-లక్నో జట్ల మ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టు తరపున బరిలోకి దిగాడు. బుమ్రా ప్లేస్‌లో అర్జున్ టెండూల్కర్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆదిలో వికెట్లు పడ్డాయి. దీంతో ఆ జట్టు ఒత్తిడికి లోనయ్యింది. పవర్ ప్లేలో కట్టదిట్టమైన బౌలింగ్‌తో రెండు ఓవర్లు చేశాడు అర్జున్ టెండూల్కర్. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
తొలి ఓవర్‌లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్‌ను ఔట్ చేసినంత పని చేశాడు అర్జున్ టెండూల్కర్. కాకపోతో రివ్యూ ద్వారా పూరన్ బయటపడ్డాడు. ఇది కరెక్ట్ కాదని భావించిన పూరన్, విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్ వేసిన మూడో ఓవర్‌లో వరుస రెండు బంతుల్లో సిక్సులు కొట్టాడు. మూడో బంతి వేసే క్రమంలో తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు అర్జున్ టెండూల్కర్. దీంతో మైదానంలో ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం నెలకొంది.
పూరన్ దూకుడు చూసి అర్జున్ గాయమంటా వెనుదిరిగాడని మైదానంలోనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడది హెడ్‌లైన్ వార్త అయ్యింది. పూరన్ దూకుడు చూసి అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడని క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌మీడియా అంతా ఇదే రచ్చ. అర్జున్ కంటిన్యూ చేస్తే ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టేవాడేమోనని అంటున్నారు.
నిజానికి చివరి మ్యాచ్‌లో యార్కర్ల కింగ్ బూమ్రా బరిలోకి దిగాలి. కాకపోతే ప్రపంచకప్ నేపథ్యంలో ఆయనకు రెస్ట్ ఇచ్చారు. ఆయన స్థానంలో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు. అర్జున్ తన టాలెంట్ నిరూపించుకుంటాడని అనుకున్నారు. కానీ ఈ విధంగా నెటిజన్స్‌కు దొరికిపోతాడని అనుకోలేదు.
ఇప్పుడే కాదు గతేడాది చివరి మ్యాచ్‌లో అర్జున్ బరిలోకి దిగి బాగానే బౌలింగ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సడన్‌గా ఓవర్ మధ్యలో మైదానం విడిచిపెట్టడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి ఐపీఎల్‌లో టాప్ బౌలర్లను చాలామంది బ్యాట్స్‌మెన్లు ఉతికేశారు. కానీ, వికెట్లు కూడా తీశారు. మొత్తానికి లక్నో మ్యాచ్ మాత్రం అర్జున్ టెండూల్కర్ కెరీర్‌లో నిలిచిపోతుందని అంటున్నారు.
Arjun Tendulkar isn't ready for top-level cricket. Mumbai Indians bought him-bad call but a Playing XI slot for him is like taking the cricket fans for granted. #BollywoodStyle.Bravo #NicholasPooran for attacking him savagely & making him leave.@mipaltan @sachin_rt @bhogleharsha pic.twitter.com/n4HVF2PPoB
— The Logician (@lordABC) May 18, 2024