BigTV English

Viral Video: ఉన్నట్టుండి జలపాతానికి భారీగా వరద నీరు.. భయంతో పరుగులు తీసిన జనం..

Viral Video: ఉన్నట్టుండి జలపాతానికి భారీగా వరద నీరు.. భయంతో పరుగులు తీసిన జనం..

Viral Video: ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా భయబ్రాంతులకు గురిచేస్తాయి. మారుతున్న కాలంతో పాటు ఆధునిక పోకడల నడుమ పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో ఏవైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అనే భయాందోళనలు మొదలయ్యాయి. కరువు, భూకంపం, సునామీ, అకాల వర్షాలు ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భయంకరమైన సంఘటనలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏ ప్రమాదం పెను ముప్పులా ముంచుకు వస్తుందో కూడా తెలియడం లేదు. ఈ తరుణంలో తాజాగా ఓ ఆకస్మిక ఘటన వెలుగుచూసింది.


తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో భయంకర ఘటన వెలుగుచూసింది. అకస్మాత్తుగా జలపాతానికి వరద నీరు తోడైంది. దీంతో ఒక్కసారిగా భారీ ఉధృతతో వరద నీరు ముంచెత్తింది. ఈ ఘటన టెంకాసిలోని పాత కొర్టాలమ్ జలపాతంలో చోటుచేసుకుంది. అప్పటిదాక నిశ్శబ్ధంగా ఉన్న జలపాతం ఒక్కసారిగా భీకరమైన శబ్ధాలతో ఉధృతంగా మారింది. దీంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

జలపాతానికి నీటి ఉధృతి పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు, పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఓ 17 ఏళ్ల బాలుడు జలపాతంలో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. బంధువులతో కలిసి స్నానానికి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. బాలుడి వివరాలను పోలీసులను తెలపగా .. గాలింపు చర్యలు చేపట్టారు.


బాలుడి పేరు అశ్విన్ అని, పాలయంకొట్టైలోని ఎన్జీవో కాలనీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. దీంతో తమిళనాడు అగ్నిమాపక, విపత్తు నిర్వాహక బృందం ఘటన స్థలానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్, పోలీసు సుపరింటెండెంట్ టిపి సురేష్ కుమార్ తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. దీంతో ప్రస్తుతం జలపాతం సందర్శనకు తాత్కాలికంగా నిషేధం విధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://x.com/shahidarafi51/status/1791437564253180124?s=48

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×