BigTV English
Advertisement

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Tripti dimri.. ఇండస్ట్రీలో అవకాశం ఎప్పుడు లభిస్తుందో తెలియదు.. అవకాశం లభించిన వెంటనే సక్సెస్ ఎప్పుడు అందుకుంటామో తెలియని పరిస్థితి ఇండస్ట్రీలో సెలబ్రిటీలను అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి గుర్తింపు రాకపోయేసరికి ఇండస్ట్రీ నుంచి వెను తిరిగిపోయిన వారు కొంతమంది అయితే ,సక్సెస్ లభించే వరకు కష్టాలను ఎదుర్కొని, ఒడ్డుకు చేరుకున్న వారు ఇంకొంతమంది అలాంటి వారిలో ప్రముఖ నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రీ (Tripti dimri)కూడా ఒకరు. సక్సెస్ కోసం ఎనిమిదేళ్లు ఎదురుచూసిన ఈమె యానిమల్ (Animal) సినిమాతో ఓవర్ నైట్ తోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.


యానిమల్ తో ఓవర్ నైట్ లో స్టార్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. కెరియర్ మొదట్లో అవకాశాలు దక్కక, తిరిగి వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను అంటూ ఎమోషనల్ అయింది. రణబీర్ కపూర్ హీరోగా , రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ చిత్రం యానిమల్. ఈ సినిమాలో జోయా పాత్రలో కనిపించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ తో ఈమె చేసిన బెడ్ రూమ్స్ సన్నివేశాలు ఎంత మంచి ఇమేజ్ అందించాయో.. అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది.


గుర్తింపు కోసం ఎనిమిదేళ్లు..

ఇదిలా ఉండగా ఎనిమిది సంవత్సరాల కిందటే పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో కెరియర్ ప్రారంభించిన ఈమె, తన గురించి తాను అందరికీ పరిచయం చేసుకోవడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. అంటే యానిమల్ సినిమా వరకు ఆమె ఎదురు చూడక తప్పలేదు. ఇక ఒక దెబ్బతో సోషల్ మీడియాలో కూడా ఈమెకు భారీగా అభిమానులు పెరిగిపోయారు. యానిమల్ సినిమా తర్వాత నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈమె , ప్రస్తుతం విక్కి విద్యా కా వో వాలా వీడియో, ధడక్, భూల్ భూలాయా 3 చిత్రాలలో ప్రస్తుతం నటిస్తోంది. అంతేకాదు మోడల్ సామ్ మర్చంట్ తో కూడా ఎఫైర్ నడుపుతోందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

50 మందితో.. ఆ బాధ భరించలేకపోయా..

Tripti dimri: Can't handle 50 people in one room - National crush..!
Tripti dimri: Can’t handle 50 people in one room – National crush..!

ఇదిలా ఉండగా మరొకవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీలోకి వెళ్తానంటే మా ఇంట్లో భయపడ్డారు. అయినా సరే ధైర్యం చేసి నేనే ముంబై కి వచ్చాను. అప్పుడు ఒకే గదిలో 50 మందితో రూమ్ షేర్ చేసుకున్నాను. అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. అవకాశాలు లేక బాధపడ్డాను. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలని అనుకున్నా.. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలనే ధృడ నిశ్చయంతో, సంకల్పంతో అవకాశాల కోసం కష్టపడ్డాను. అయితే ఆ సమయంలో నాకు పెళ్లి కాదని, ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని మా తల్లిదండ్రులకు లేనిపోనివి నూరిపోశారు. కానీ అదే సమయంలో నాకు లైలా మజ్ను సినిమాలో అవకాశం దక్కడంతో ఈ విషయం మా తల్లిదండ్రులకు చెప్పగా వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అంటూ తెలిపింది తృప్తి. మొత్తానికి తాను పడ్డ కష్టానికి ఫలితం లభించింది అని చెప్పడంతో నెటిజెన్లు కూడా ఈమె పడిన కష్టానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×