Tripti Dimri : బాలీవుడ్ లో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన యానిమల్ (Animal Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ తృప్తి దిమ్రి ( Tripti Dimri) .. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అంతేకాదు ఆ మూవీలో ఈమె అందాలకు కుర్ర కారు ఫిదా అవ్వడంతో పాటు యూత్ క్రష్ అయ్యింది. అయితే ఈమె ఎనిమిదేళ్ల క్రితమే ఓ మూవీతో పలకరించిన కూడా ఆ మూవీ అంత క్రేజ్ ను అందించలేకపోయింది. యానిమల్ మూవీ తో ఆమె రేంజ్ మారింది. జనానికి ఆమె గురించి తెలియడానికి యానిమల్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. యానిమల్ తర్వాత అమ్మడును నేషనల్ క్రష్ గా అభిమానులు పిలుస్తున్నారు. అయితే ఈమె బాయ్ ఫ్రెండ్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అతను ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
నేషనల్ క్రష్ తృప్తి యానిమల్ మూవీ భారీ సక్సెస్ టాక్ ను అందుకోవడంతో వరుస సినిమా ఆపర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. విక్కి విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలాయా 3, ధడక్‌ల లో ఆమె నటించారు. ఆ మూవీలు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. దాంతో పాపకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. బాలీవుడ్ తో పాటుగా ఆ మధ్య టాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే..
Also Read : మంచక్క ఇలాంటి షాక్ ఇస్తావనుకోలేదు.. ట్రోలర్స్ కు కౌంటర్..!!
సినిమాలు హిట్ అయితే బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అందరు హీరోయిన్ల లాగానే ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఓ వార్త షికార్ చేస్తుంది. మోడల్ , వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో తృప్తి డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. బీటౌన్ టాక్‌ను బట్టి ఈ జంట 2017 నుంచి సన్నిహితంగా ఉంటున్నారట.. ఈ మధ్య అతనికి బర్త్ డే విషెస్ చెప్పడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి మరోసారి కెమెరాకు చిక్కారు.. సామ్‌తో బైక్‌పై చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది.. దాంతో వీళ్ళు రిలేషన్ లో ఉన్నారనే వార్త కన్ఫామ్ అయ్యింది. వీడియో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ జంట త్వరలోనే తమ బంధాన్ని బయటపెట్టి పెళ్లి పీటలెక్కుతారనే వార్తలు వస్తున్నాయి.. ఇక తృప్తి ఎన్నో కష్టాలను అనుభవించారు. చిత్ర పరిశ్రమలోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు చాలా భయపడ్డారని.. కానీ తానే ధైర్యం చేసి ముంబైకి వచ్చానని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.. ప్రస్తుతం తన సినీ కెరీర్ పై మాత్రమే తృప్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరి పెళ్లి పై వస్తున్న వార్తల పై ఆమె స్పందిస్తారేమో చూడాలి..