Manchu Lakshmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ ( Manchu Lakshmi ) పేరు తెలియని వాళ్ళు ఉండరు. మంచు మోహన్ బాబు కూతురు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుస సినిమాలతో ఒకప్పుడు బిజీగా ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం సరైన హిట్ సినిమాలు లేక తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ప్రస్తుతం హిందీలో సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. స్టార్ కిడ్ గా ఆడియెన్స్ కు పరిచయం అయినా ఆమెకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని మంచు లక్ష్మి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.. 20 సినిమాలకు పైగా నటించి మెప్పించింది. అమెరికా వెబ్ సిరిస్లో కూడా నటించింది. ఇదిలా ఉండగా మంచు అమ్మాయి తన భర్త గురించి సంచలన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఈమె కెరీర్ పై ఎంత ఫోకస్ పెడతారో అలాగే ఫ్యామిలీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. మంచు ఫ్యామిలీ గొడవలు ఇటీవల తరుచుగా బయటికి వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆమె వంతుగా ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్యలో మంచు మనోజ్ పెళ్లి పెద్దగానూ వ్యవహరించి జనాల నుంచి ప్రశంసలు పొందారు. ఫ్యామిలీ వద్దని అన్నా కూడా ఆమె ధైర్యం చేసి వారిద్దరికీ పెళ్లి జరిపించారు. అప్పట్లో ఈ టాపిక్ పై అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం ఆ ఇంట ముదురుతున్న ఘర్షణలను ఎప్పటికప్పుడు నివారించే ప్రయత్నం చేస్తూనే వస్తోంది..
Also Read : మహిళల ఇజ్జత్ తీసిన గ్లోబల్ బ్యూటీ.. నెటిజన్స్ ఫైర్…
అయితే మంచు లక్ష్మీ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎప్పుడు ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో ఏదోకటి షేర్ చేసుకుంటుంది. ఈమెకు పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది. కానీ ఈమె భర్తకు దూరంగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతవరకు లక్ష్మి ఎక్కడా ఓపెన్ కాలేదు. దీంతో ఆ సందేహాన్ని నివృత్తి చేసేవారు లేరు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్తతో దూరంగా ఉండటంపై మంచు అమ్మాయి క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పింది. కానీ సమాజంలో ఉన్న ధోరణిలా కాకుండా ఎవరికి వారు ప్రశాంతంగా బతికేలా, స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని తెలిపింది. కోవిడ్ తర్వాత మేము స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నాం. అందుకే సమయం దొరికినప్పుడు ఇద్దరం కలుసుకుంటాం. మొన్న రెండు నెలలు ఆయనతోనే ఉన్నాను. ఆయన రీసెంట్ గా నాతో వారం ఉన్నారు. పాప కూడా ప్రస్తుతం ఆయతోనే ఉంది. మేము హ్యాపీ గానే ఉన్నాం మీరు విడగొట్టాలని చూడకండి. మా ప్రైవైసీని దూరం చెయ్యకండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మంచక్క.. ఇక సినిమాల విషయానికొస్తే.. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ముంబైలోనే ఉంటోంది. ప్రస్తుతం ‘ఆదిపర్వం’ చిత్రంలో నటిస్తోంది. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలోని తన నటనకు లక్ష్మి మంచు ప్రశంసలు అందుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది..