BigTV English

HBD Trisha Krishnan: 42 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరం.. ఏకంగా అంత మందితో ఎఫైర్ నడిపారా..?

HBD Trisha Krishnan: 42 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరం.. ఏకంగా అంత మందితో ఎఫైర్ నడిపారా..?

HBD Trisha Krishnan:తెలుగు, తమిళ్, మళయాళం సినిమాలలో నటించి, నటిగా ప్రేక్షకులకు పరిచయమైన త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా.. ఇంకా అదే అందంతో, క్రేజ్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టక ముందే ప్రశాంత్ (Prashanth ), సిమ్రాన్ (Simran ) జంటగా నటించిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ పక్కన నటించింది. తర్వాత తెలుగులో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘వర్షం’ సినిమాతో అడుగు పెట్టింది. ఇదిలా ఉండగా 1983 మే 4న తమిళనాడు చెన్నైలో జన్మించిన ఈమె.. ప్రస్తుతం తన తల్లి , తండ్రి, బామ్మతో కలిసి చెన్నైలోనే నివసిస్తోంది. ఇకపోతే త్రిష ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళే అవుతోంది. పైగా ఈమె వయసు 42 ఏళ్లు. ఇంత వయసు వచ్చినా సరే పెళ్లికి మాత్రం దూరం గానే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే గతంలోనే ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది త్రిష. ఇకపోతే త్రిష పెళ్లి చేసుకోలేదు కానీ ఎఫైర్ వార్తల్లో మాత్రం నిత్యం నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఎంతమందితో ఇలాంటి ఎఫైర్ రూమర్స్ వినిపించాయో ఇప్పుడు చూద్దాం.


ప్రభాస్ – త్రిష :

ప్రభాస్ (Prabhas ), త్రిష (Trisha) ‘వర్షం’ సినిమాలో కలిసి జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ వీరి పెళ్లికి దివంగత లెజెండ్రీ నటులు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) అంగీకరించలేదని, అందుకే వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి..కానీ ఇందులో నిజానిజాలు మాత్రం తెలియదనే చెప్పాలి. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు కూడా వచ్చాయి.


త్రిష – విజయ్ దళపతి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) తో కూడా ఈమె ఎఫైర్ నడిపిందనే వార్తలు గతంలో జోరుగా వినిపించాయి. ముఖ్యంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా విజయ్ తో కలిసి నాలుగు సినిమాలు చేసింది . ఈ క్రమంలోనే అతనితో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. కానీ మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ అయిందని సమాచారం. అయితే అప్పటికే విజయ్ కి పెళ్లయింది కూడా.. మొన్నటి వరకు సైలెంట్ అయిన రూమర్స్.. ఇప్పుడు మళ్లీ గుప్పుమన్నాయి. విజయ్ తో మళ్ళీ ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. విజయ్ తో కలిసి ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూ.. అతనితో కలిసి చట్టపట్టాలేసుకొని తిరుగుతోంది. కానీ రూమర్స్ పై మాత్రం వీరు స్పందించకపోవడం గమనార్హం.

త్రిష – రాణా దగ్గుబాటి :

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న రాణా దగ్గుబాటి, త్రిష రాసుకుపూసుకు తిరిగారు. కానీ చివర్లో మాత్రం ఇద్దరూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక రాణా.. మిహికా బజాజ్ ను వివాహం చేసుకోగా.. త్రిష మాత్రం ఒంటరిగానే ఉంది.

త్రిష – శింబు

త్రిష రాణా నుండి విడిపోయిన తర్వాత శింబు(Simbu) తో కూడా కొంతకాలం ప్రేమలో ఉంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

త్రిష – ధనుష్

శింబు నుండి విడిపోయిన తర్వాత త్రిష.. ధనుష్(Dhanush) తో ప్రేమలో పడిందని, కొంతకాలం వార్తలు బాగా వినిపించిన విషయం తెలిసిందే..సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) అల్లుడితో త్రిష లవ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో హెడ్లైన్స్ కూడా సృష్టించారు. ఇలా ఎంతోమందితో ఎఫైర్ రూమర్స్ అంటకట్టారు కానీ ఏదీ కూడా నిజం కాకపోవడం గమనార్హం.

ALSO READ:Raviteja: ఆ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్.. హింట్ ఇచ్చిన డైరెక్టర్..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×