Raviteja:టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ లో ‘జాట్’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇందులో తన పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది. ఇక అలా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకొని, సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. అందులో భాగంగానే రవితేజ (Raviteja) బ్లాక్ బస్టర్ మూవీ ‘క్రాక్’ మూవీ సీక్వెల్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
క్రాక్ మూవీ సీక్వెల్ పై రవితేజ క్లారిటీ..
మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ (Shruti Haasan) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. కరోనా టైంలో విడుదలైనా సరే మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ డైరెక్టర్ తెలిపారు. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభిస్తామని గోపీచంద్ మలినేని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే క్రాక్ మూవీ సీక్వెల్ త్వరలోనే రాబోతోందని తెలిసి, ఇక ఆ సినిమా నేపథ్యం ఏమిటి? ఎలా ఉండబోతోంది? అని అభిమానులు అప్పుడే చర్చించడం మొదలుపెట్టారు. ఇంకా క్రాక్ మూవీ విషయానికి వస్తే.. వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar), సముద్ర ఖని(Samudra khani) విలన్లుగా నటించారు. కే.విష్ణు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా.. రామ్ – లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందించారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ లో బి. మధు ఈ సినిమాని నిర్మించగా.. ఎస్ తమన్ (S.Thaman) సంగీతం అందించడం జరిగింది. ఇక 2021 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, అటు రవితేజ కి కూడా మంచి సక్సెస్ ను అందించింది.
రవితేజ సినిమాలు..
ఇకపోతే మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే.. భాను భోగవరపు (Bhanu bhogavarapu) దర్శకత్వంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే ‘ధమాకా’ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అందుకే అటు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, ఇటు ఒక్క హిట్ అయినా అందుకోవాలని ఆరాటపడుతున్న శ్రీ లీల మళ్లీ జతకట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజ క్రాక్ సీక్వెల్ మొదలు పెడతారా? లేక ఇంకొంతకాలం తర్వాత సినిమా స్టార్ట్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది
ALSO READ:Subham Pre Release Event: సమంత శుభం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సామ్ ను నేరుగా కలిసే అవకాశం..?