BigTV English
Advertisement

Allu Arjun : రీల్ లైఫ్ ఫైర్, రియల్ లైఫ్ లో ఫ్లవర్… అంటూ ట్రోల్స్

Allu Arjun : రీల్ లైఫ్ ఫైర్, రియల్ లైఫ్ లో ఫ్లవర్… అంటూ ట్రోల్స్

Allu Arjun : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా పరిచయమైన సినిమా లీడర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అనుకున్న సక్సెస్ సాధించకపోయిన కూడా చాలామందికి ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో శేఖర్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక సందర్భంలో రానా మాట్లాడుతూ “ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత పోతే ఎంత శర్మగారు” అంటాడు. ఆ డైలాగ్ ఇప్పటికీ కూడా వింటున్నప్పుడు మనం ఎమోషన్ కి గురవుతాము. పుష్ప సినిమాలో డైలాగ్ కూడా ఇంచుమించు అలానే ఉంది.


అయితే ఇప్పుడు ఈ డైలాగ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.? పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ 4వ తారీఖు నుంచి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సంధ్యా థియేటర్లో చూడడానికి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు వచ్చాడు. అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి చాలామంది ప్రేక్షకులతో పాటు టికెట్ కొనకుండా అభిమానులు కూడా థియేటర్ లోకి వచ్చేశారు. అయితే ఊహించిన పరిణామం అక్కడ చోటుచేసుకుంది. సినిమాను చూడటానికి వచ్చిన ఒక ఫ్యామిలీ విషాదాన్ని చవిచూసింది. రేవతి అనే ఒక మహిళ పుష్ప 2 సినిమా చూడటానికి తన కుటుంబంతో పాటు థియేటర్ కు వచ్చింది. ఆ తరుణంలో థియేటర్లో అనుకొని విధంగా తొక్కిసలాట జరగడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమారుడు ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.

ఈ విషయంపై చాలామంది సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ టీవీ చానల్స్ లో మాట్లాడుతున్నారు. అయితే అలా మాట్లాడుతున్న వాళ్లకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక అధికారిక పోస్టును ట్విట్టర్ లో పెట్టింది. ఇకపోతే కొంతమంది దీనిని కూడా పరిగణలోకి తీసుకొని, ఒక వైపు ఆడపిల్ల ప్రాణం పోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమో ఏమీ మాట్లాడొద్దు అని అంటున్నారు. అయితే సినిమాలో పుష్పరాజ్ ఆడపిల్లను కాపాడుతాడు. అదే రియల్ లైఫ్ లో అయితే ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇప్పటివరకు మాట్లాడలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Also Read: Pushpa 2 : ఫఫా ను కరక్ట్ గా చూపిస్తే భాయ్ తెలిపోయేవాడు

అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో ఆడపిల్లకు అన్యాయం జరిగితే తట్టుకోలేను అంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ షోలో కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించాడు అల్లు అర్జున్. రియల్ లైఫ్ లో ఒక కుటుంబం రోడ్డుమీద పడిపోయిన కూడా ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు.? అనేది కొంతమంది వాదిస్తున్నారు. అంటే సినిమాలో మాత్రమే ఫైరా రియల్ లైఫ్ లో ఫ్లవర్ అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత బన్నీ వాసుకి ఈ విషయాన్ని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి కావలసిన అన్ని తాను చూసుకుంటానని బన్నీ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక కొన్ని రోజుల్లో బన్నీ కూడా వాళ్ళని వెళ్లి కలవబోతున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా అధికారికంగా బన్నీ దీనిపై స్పందిస్తే గాని ఈ విమర్శలకు చెక్ పడదు.

Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×