Fahadh Faasil in Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమాకి ఉన్న విలక్షణమైన నటులలో ఫహద్ ఫాజిల్ ఒకరు. పేరుకు మలయాళం హీరో అయినా కూడా ఫహద్ ఫజిల్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓటీటి పుణ్యమా అంటూ ప్రతి భాషలో సినిమాలను తెలుగు ప్రేక్షకులు అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూశారు. ఈ తరుణంలో ఒక చోట ఆగిపోయి ట్రాన్స్ సినిమాతో ఫహద్ ఫాజిల్ కు అందరూ కనెక్ట్ అయిపోయారు. అయితే ఆ సినిమా తర్వాత ఫహద్ ఫాజిల్ చేసిన సినిమాలను వెతుక్కుని మరీ చూసిన ఆడియన్స్ ఉన్నారు. ఇక్కడితో ఫహద్ ఫాజిల్ రేంజ్ వేరే రేంజ్ కి ఎదిగిపోయింది.
ఇకపోతే తెలుగులో సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మాట్లాడడానికి కేరళ కు వెళ్ళాడు సుకుమార్. అయితే అప్పటికే సుకుమార్ గురించి తెలిసిన ఫహద్ వైఫ్ నజ్రియా వస్తున్న డైరెక్టర్ బాగా టాలెంటెడ్ తను ఏ కథ చెప్పినా కూడా మీరు ఓకే చేసేయండి అంటూ ఫహద్ కి చెప్పుకొచ్చారు. అయితే సుకుమార్ చెప్పిన కథ వినగానే ఓకే చెప్పేసాడు ఫహద్. ఆ రకంగా విజయ్ సేతుపతి నటించాల్సిన రోల్ లో ఫహద్ ఫాజల్ కనిపించాడు.
పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ ఎంతటి కీలకపాత్రను పోషించారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఫహద్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాస్తవానికి సుకుమార్ ఈ కథను ఫహద్ చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా తన క్యారెక్టర్ ను డిజైన్ చేసి చెప్పాడట కానీ సినిమా విషయానికి వస్తే కేవలం విలన్ గా మాత్రమే ఫహాద్ చూపించాడు. ఇకపోతే పుష్ప 2 విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా కూడా ఇండియన్ సినిమాలో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది అని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
Also Read : Allu Arjun – Allu Sirish : అల్లు అర్జున్‌లా అల్లు శిరీష్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఇవేనా..?
ఇక్కడ వరకు అంత బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ ఫ్యాన్స్ మాత్రం పూర్తి నిరాశలో ఉన్నారు. ఫహద్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. అటువంటి ఫహాద్ ను పుష్ప సినిమాలో కంప్లీట్ గా వాడుకోలేదు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఫహాద్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పుష్పరాజు ఉచ్చ పోసే సీన్ మాత్రం చాలామందికి ఎబ్బేట్టుగా అనిపించింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న కూడా ఫహద్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా అక్కడక్కడ చిత్ర యూనిట్ పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు.