Mamta Kulkarni.. ఒకప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలిన బ్యూటీ మమతా కులకర్ణి (Mamta Kulkarni). భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బెంగాలీ, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం చిత్రాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ముఖ్యంగా క్రాంతి వీర్, సబ్సే బడా కిలాడి, బాజీ వంటి హిందీ సినిమాల ద్వారా మంచి నటిగా పేరు దక్కించుకున్న ఈమె హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న సమయంలో ఎదురుదెబ్బ తగిలింది.
25 ఏళ్ల తర్వాత మాతృభూమికి చేరుకున్న బ్యూటీ..
అనుకోకుండా ఒక డ్రగ్ కేస్ ఆమె జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ముఖ్యంగా అరెస్టు చేయడం, జైలు జీవితం అన్నీ కూడా ఆమె కెరియర్ ను నాశనం చేశాయి. ఆ తర్వాత ఇండియా వదిలి కెన్యాకు వెళ్ళిపోయింది. అక్కడే జీవితాన్ని మొదలుపెట్టి స్థిరపడిపోయింది. అలా 25 ఏళ్లుగా మాతృభూమికి దూరమయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మళ్లీ 25యేళ్ల తర్వాత ఇండియాకు తిరిగివచ్చింది. తాజాగా ముంబై కి చేరుకున్న ఆమె పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది మమతా కులకర్ణి. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
తప్పుడు ఆరోపణల కారణంగా జైలుశిక్ష..
మమతా కులకర్ణి విషయానికి వస్తే.. 2016లో రూ.2000 కోట్ల డ్రగ్ కేసులో ఇరుక్కోవడంతో ఈ విషయం అప్పట్లో సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఏప్రిల్ 12 2016న రెండు వాహనాల నుంచి ఏకంగా మూడు కిలోల ఎఫిడ్రిన్ పౌడర్ ను స్వాధీనం చేసుకోవడంతో ఈమెతో పాటు మరో ఏడుగురిని మోస్ట్ వాంటెడ్ గా పోలీసులు ప్రకటించారు. నిజానికి ఈమె భర్త విక్కీ గోస్వామి మాదకద్రవ్యాలను విక్రయిస్తుంటారు. 2016లో జనవరిలో కెన్యాలో జరిగిన సమావేశానికి మమత హాజరైందని, నిందితుడైన తన భర్త విక్కీ గోస్వామి తో కలిసి ఆ సమావేశంలో పాల్గొన్నారని పోలీసులు కూడా తెలిపారు. డ్రగ్స్ పట్టి వేసిన తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం కింద 2016 లోనే థానే పోలీసులు మమతా కులకర్ణి పై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు కూడా.. దాంతో జైలు జీవితం అనుభవించిన ఈమె కొన్ని రోజుల తర్వాత విడుదలయ్యారు.
క్లీన్ చిట్ ఇస్తూ పోలీసు శాఖపై మండిపడ్డ ధర్మాసనం..
ఇకపోతే 2018లో థానే పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని 2018 లో మమతా కులకర్ణి హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన అనంతరం గత ఆగస్టులో ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో నటి పైన నమోదైన డ్రగ్స్ కేసును కాస్త హైకోర్టు కొట్టి వేసింది.. అంతేకాదు మమతా కులకర్ణి పై చర్యలు తీసుకోవడం విచారణకరమని కూడా న్యాయస్థానం తప్పు పట్టింది. ముఖ్యంగా హీరోయిన్ కి వ్యతిరేకంగా సాక్షాలు సేకరించి ఆమెపై నేరం మోపినట్లుగా ధర్మాసనం స్పష్టం చేసింది. చాలా సంవత్సరాలుగా ఆరోపణలు ఉన్నప్పటికీ మమతా కులకర్ణి ఎప్పుడు ఎటువంటి తప్పు చేయలేదని, కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆమె బాలీవుడ్ కెరీర్ ని కూడా ఈ విషయం దెబ్బతీసిందని న్యాయస్థానం తెలిపింది. ఇక తాజాగా ఇండియాకి వచ్చిన ఆమె ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేసింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">