E-Paper
Advertisement

Tumbaad Director : నిర్మాతతో ‘తుంబాడ్’ డైరెక్టర్ విభేదాలు… జాగ్రత్తగా ఉండండి అంటూ షాకింగ్ పోస్ట్

Tumbaad Director : నిర్మాతతో ‘తుంబాడ్’ డైరెక్టర్ విభేదాలు… జాగ్రత్తగా ఉండండి అంటూ షాకింగ్ పోస్ట్
Advertisement

Tumbaad Director : ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాలలో ‘తుంబాడ్’ కూడా ఒకటి. 2018లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా రీ రిలీజై మరోసారి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో రాహి అనిల్ బార్వే డైరెక్టర్ గా పాపులర్ అయ్యారు. అయితే తాజాగా జరిగిన కొన్ని పరిణామాల వల్ల డైరెక్టర్ అనిల్ కి, నిర్మాతకి మధ్య విభేదాలు నెలకొన్నాయి అనే వార్త వైరల్ అవుతుంది. తాజాగా ‘జాగ్రత్తగా’ ఉండండి అంటూ డైరెక్టర్ అనిల్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది.

‘తుంబాడ్’ డైరెక్టర్ పోస్ట్ లో ఏముందంటే.. 

Advertisement

‘తుంబాడ్’ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే తన పోస్ట్ లో ‘తొలి సినిమాను రూపొందించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫస్ట్ టైమర్ ఫీజులను కొన్ని బాలీవుడ్ స్టూడియోలు జోక్ గా చూస్తున్నాయి. తమ కలలను ప్రేక్షకుల ముందు పెట్టాలని పోరాడుతున్న చాలామంది ఫిలిం మేకర్స్, నటీనటులు ఈ సమస్య తీవ్రత ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి రూల్స్ ను అర్థం చేసుకోవడానికి న్యాయవాదిని నిర్మించుకునే శక్తి లేక, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఈ సమస్యలో చిక్కుకుంటున్నారు. నేను కలిసి పని చేసిన చాలా మంది నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సమస్యను ఎదుర్కోవడమే కాదు ఈ కాంట్రాక్ట్ వల్ల తీవ్రంగా నష్టాల పాలయ్యారు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా కాంట్రాక్ట్ కో సంతకం చేసే ముందు మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ను కాపాడుకోండి’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే ఉన్నట్టుండి డైరెక్టర్ అనిల్ ఇలాంటి పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటో అనేది కొత్త చర్చకు దారి తీసింది. నిర్మాత సోహమ్ షాతో తనకు వచ్చిన విభేదాలే ఇలాంటి పోస్టుకు కారణం అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ‘తుంబాడ్’ పార్ట్ 2కి డైరెక్టర్ అనిల్ దర్శకత్వం బాధ్యతలు చేపట్టకపోవడం కూడా పలు అనుమానాలుకు తావిచ్చింది.

రూమర్లను కొట్టి పారేసిన నిర్మాత

Advertisement

‘తుంబాడ్’ నిర్మాత, నటుడు సోహమ్ షా తనకు డైరెక్టర్ తో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పిన నిర్మాత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చాలా కాలంగా ‘తుంబాడ్ 2’ మూవీని తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే స్క్రిప్ రాసే టైంలో కాస్త ఇబ్బందులు తలెత్తయని చెప్పారు. యోగేష్ చంద్రకర్ తో కలిసి ఎట్టకేలకు స్క్రిప్టును పూర్తి చేసామని,  మరోవైపు అనిల్ గోల్కొండ టేల్స్, రక్త బ్రహ్మాండ్ వంటి మెగా ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడని అన్నారు. ఒకవేళ ‘తుంబాడ్ 2’కు అవసరం అయితే అనిల్ తప్పకుండా ప్రాజెక్టులో భాగమవుతారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అనిల్ తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అంటూ తమ మధ్య విభేదాలు ఏమీ లేవన్న విషయాన్ని వెల్లడించారు. కానీ తాజాగా డైరెక్ర్ చేసిన పోస్ట్ మాత్రం మరోసారి ఇద్దరి మధ్య గొడవలు నెలకొన్నాయా అనే అనుమానాలను కలిగిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×