EPAPER

Warangal Politics: కేటీఆర్ పెట్టిన చిచ్చు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు ఉచ్చు బిగుస్తోందా..?

Warangal Politics: కేటీఆర్ పెట్టిన చిచ్చు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు ఉచ్చు బిగుస్తోందా..?

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ కీలకమైన నగరం వరంగల్. అలాంటి సిటీ గత కొన్ని సంవత్సరాలుగా చిన్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతూ కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి. 2022లో కురిసిన వర్షాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని సుమారు 38 కాలనీలు నీట మునిగి వేల మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది. రెండవ రాజధానిగా పేరు ఉన్నప్పటికీ మౌలిక వసతులు కల్పన ముంపు సమస్యను తీర్చడంలో, గత పదేళ్లుగా బిఆర్ఎస్ నిర్లక్ష్యం వహించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో మౌలిక వసతుల కల్పన కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. ఆ క్రమంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి కి భారీ మెజార్టీ గెలిపించారు హన్మకొండ ఓటర్లు.

హనుమకొండ జిల్లాలో ప్రధాన సమస్య నయింనగర్ నాలా ముంపు సమస్య.. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నాలా వెడల్పు. రిటైనింగ్ వాల్ నిర్మాణం. నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికగా మొదలు పెట్టించి రికార్డు సమయంలో పూర్తి చేయించారు అంతేకాకుండా పదేళ్లుగా నిర్లక్ష్యంగా నడుస్తున్న కాళోజి కళాక్షేత్రాన్ని పూర్తి చేయించారు. మొత్తంగా గత పదేళ్ల నిర్లక్ష్యానికి 10 నెలల కమిట్మెంట్ కు తేడా చూడండి అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి.


వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుండటంతో వాటి క్రెడిట్ దక్కించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండటం విమర్శల పాలవుతుంది.. టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూర్తైన పనులన్నీ తన హయాంలోనే జరిగినట్లు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా హనుమకొండ జిల్లా సమీక్ష సమావేశంలో స్వయంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ ఎమ్మెల్యే తాను చేసినట్లుగా చెప్పుకొని పూలాభిషేకాలు చేసుకుంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేని వాడు వీడని ఏకవచనంలో సంభోదించడం వివదాస్పదంగా మారింది.

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నయింనగర్ నాలా పనులు ఎవరు చేశారో నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. 29వ తేదీన 10 గంటలకు నయింనగర్ బ్రిడ్జి పైకి కేటీఆర్ వస్తే, ఎవరిపై ప్రజలు రాళ్ళ్లేస్తారో, ఎవరిపై పువ్వులు వేస్తారో చూద్దామని సవాల్ విసిరారు. చెప్పినట్లుగానే నాయిని రాజేందర్ రెడ్డి నయింనగర్ బ్రిడ్జిపైకి స్థానికులతో కలిసి వెళ్ళారు. కేటీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళలు చీరె, గాజులు సైతం తీసుకెళ్ళి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని కేటీఆర్ కు, బీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరికలు జారీ చేశారు… బీఆర్ఎస్ శ్రేణుల కోసం ఎమ్మెల్యే నాయిని గంటసేపు బ్రిడ్జిపై ఎదురుచూసినా వారు స్పందించలేదు. ఆ క్రమంలో పార్టీ ఆఫీసు కోసం పార్కును కబ్జా పెట్టిన వారు అబద్దాల ప్రచారాలు చేసుకుంటున్నారని నాయిని తీవ్ర స్థాయితో మండిపడ్డారు.

Also Read:  కొలికపూడి వివాదంలో కొత్త ట్విస్ట్.. అరెస్ట్ తప్పదా

అయితే మరసటి రోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తన అనుచరులతో ర్యాలీగా నయీమ్ నగర్ బ్రిడ్జి పైకి వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి నిధులను గత సర్కారీ విడుదల చేసిందని తాను బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టే లోపే ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని బ్రిడ్జి క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని దోచుకున్న సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం బ్రిడ్జి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయగా, సీఎంకు, ఎమ్మెల్యే నాయనికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. దాంతో రెండువర్గాలు ఒకరిపై ఒకరు దూసుకొచ్చి ఘర్షణకు దిగడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి చెదరగొట్టారు. సుమారు గంట పాటు నయీమ్ నగర్ బ్రిడ్జి వద్ద హైడ్రామా నడిచింది. చివరకు మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తతకు తెరపడింది.

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలకు మరోసారి ఎమ్మెల్యే నాని నాగేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీ పేరు చెప్పుకొని బీసీలను అణగతొక్కిన చరిత్ర వినయ్ భాస్కర్‌దని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపాలను నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు. వినయ్ భాస్కర్ చరిత్ర బయటపెడితే మద్రాస్ కు పారిపోవాల్సిందేనని ఫైర్ అయ్యారు. పదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదల దగ్గర దోచుకున్న భూములను తిరిగి వారికివ్వాలని.. దానికి పది రోజుల డెడ్‌లైన్ విధించారు .. లేకుంటే వినయ్ భాస్కర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసి ప్రజల ముందు తన చరిత్రను బయటపెడతానని తీవ్ర హెచ్చరికలు చేశారు.

పదేళ్లు అభివృద్ధిని పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు, 10 నెలల కాంగ్రెస్ పాలనలో పనులు పూర్తి చేయగానే, ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయనే చర్చ హన్మకొండలో జరుగుతోంది. అభివృద్ధి పనుల అంశం పక్కనపెడితే బీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాలను ఎమ్మెల్యే నాయిని ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఎరక్కపోయి, ఇరుకున్నమనే భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది.

Related News

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

×